నిస్తేజంలో ఏపి భాజపా

Published : Oct 28, 2016, 05:29 AM ISTUpdated : Mar 25, 2018, 11:41 PM IST
నిస్తేజంలో ఏపి భాజపా

సారాంశం

నిస్తేజంలో ఏపి భాజపా కొత్త అధ్యక్షుడిని కూాడా నియమించుకోలేని దుస్ధితి వర్గ పోరే ప్రధాన కారణం

 నిస్తేజంలో ఏపి భారతీయ జనతా పార్టీ కొట్టుమిట్టాడుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్నామన్న సంతోషం కూడా పార్టీ నేతల్లో, క్యాడర్ లో కనబడటం లేదు. రెండున్నరేళ్ళ క్రితం అటు కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలో మిత్రపక్షంగా అధికారంలోకి వచ్చినపుడు పలువురు నేతల్లో ఎంతో జోష్ కనబడింది. అయితే, కాలం గడిచేకొద్దీ ఆ సంతోషం ఆవిరైపోయింది.

రాష్ట్ర పార్టీకి కొత్తగా అధ్యక్షుడిని కూడా నియమించుకోలేకపోవటమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దాంతో గడచిన రెండున్నరేళ్ళుగా పార్టీ దాదాపు నిస్తేజంగా మారిపోయింది. రాష్ట్రంలోని అధికార టిడిపికి మిత్రపక్షమవటంతో ప్రభుత్వంలోని లోపాలను సైతం ఎత్తి చూపే పరిస్ధితి లేకపోవటంతో భాజపా నేతలను నిస్పృహలోకి నెట్టేస్తోంది.

ఉమ్మడి రాష్ట్రానికి అధ్యక్షునిగా కిషన్ రెడ్డి ఉండేవారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపికి విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడు కంభంపాటి హరిబాబు అధ్యక్షునిగా నియమితులయ్యారు. అయితే, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళటంలోను, పార్టీ క్యాదర్ లో ఉత్సాహం నింపటంలోను పూర్తిగా విఫలమయ్యారని పార్టీలో ఆరోపణలు మొదలయ్యాయి.

దాంతో అధ్యక్షునిగా తన స్ధానంలో వేరెకొరిని నియమించుకోవాల్సిందిగా హరిబాబు జాతీయ నాయకత్వానికి స్పష్టం చేసినట్లు సమాచారం. అంతే కాకుండా అధ్యక్షునిగా కొనసాగటంపై తనకు ఆశక్తి కూడా లేదని, కాబట్టి జాతీయ నాయకత్వం వేరే నేతను అధ్యక్షునిగా నియమిస్తే తనకు అభ్యంతరం లేదని కూడా స్పష్టం చేసినట్లు సమాచారం.

 దాంతో అధ్యక్షునిగా జాతీయ నాయకత్వం అన్వేషణ మొదలుపెట్టంది. ఈ నేపధ్యంలోనే అనేక పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. అయితే, ఆ దశలోనే పార్టీలో అప్పటికే నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గ పోరు బహిర్గతమైంది. వర్గపోరు కారణంగానే రెండు ఏళ్ళుగా కొత్త అధ్యక్షుడిని నియమించుకోలేకున్నారు. పరిశీలనకు వచ్చిన పేర్లలో సోము వీర్రాజు పేరు కూడా ఒకటి.

వీర్రాజు అప్పటికే చంద్రబాబు ప్రభుత్వంపై అనేక సందర్భాల్లో ధ్వజమెత్తుతున్నారు. ప్రభుత్వంలోని తప్పొప్పులను బహిరంగంగా ఎత్తి చూపుతున్నారు. ఆయన నియామకంపై జాతీయ నాయకత్వం సానుకూలంగా ఉందన్న ప్రచారం మొదలవ్వటంతో పార్టీలోని బలమైన వెంకయ్య వర్గం వ్యతిరేకించింనట్లు ప్రచారం.

 దాంతో వెంకయ్య వ్యతిరేక వర్గంగా ప్రచారంలో ఉన్న పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, కావూరి సాంబశివరావు తదితర నేతలు వీర్రాజుకు మద్దతుగా నిలబడ్దారు. ఇక, రేపో మాపో వీర్రాజుకు పార్టీ పగ్గాలు అప్పచెబుతారన్న ప్రచారం ఊపందుకుంది. అయితే, వీర్రాజుకు పార్టీ పగ్గాలు అప్పగించకూడదని ఇటు టిడిపి నుండి కూడా వెంకయ్యపై ఒత్తిడి మొదలైనట్లు సమాచారం.

టిడిపికి వత్తాసు పలుకుతూ వెంకయ్య కూడా పార్టీ జాతీయ నాయకత్వంపై వీర్రాజు నియామకానికి అభ్యంతరం చెప్పినట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఈ విషయాలను గ్రహించిన వీర్రాజుకు మద్దతు ఇస్తున్న వర్గం రాష్ట్రంలో పార్టీ బలోపేతమవ్వాలంటే వీర్రాజే

సరైన అభ్యర్ధిగా ఒత్తిడి మొదలుపెట్టారు. అంటే వీర్రాజు నియామకానికి ఒక వర్గం, వ్యతిరేకంగా మరో వర్గం జాతీయ నాయకత్వంపై గట్టిగా ఒత్తిడి మొదలుపెట్టింది. దాంతో ఏమి చేయాలో జాతీయ నాయకత్వానికి తోచలేదు.

ఏ వర్గాన్నీ  కాదన లేని జాతీయ నాయకత్వం వీర్రాజు నియామకాన్ని పెండింగ్ లో  పెట్టేసింది. ఫలితంగా రెండున్నరేళ్ళుగా నూతన అధ్యక్షుడిని నియమించుకోలేని దుస్థితిలో పార్టీ పడిపోయింది. హరిబాబు పార్టీ కార్యక్రమాలను చురుగ్గా చేపట్టలేక కొత్త అధ్యక్షుడి నియామకం జరగకపోవటంతో రాష్ట్ర పార్టీలో పూర్తిగా నిస్తేజం అలుముకుంది.

PREV
click me!

Recommended Stories

Christmas Holidays : ఓరోజు ముందుగానే క్రిస్మస్ సెలవులు.. ఎప్పటివరకో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!
Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu