ఆంధ్రా గవర్నమెంట్లో "లోకం చుడుతున్న వీరుడు "

Published : Oct 27, 2016, 12:42 PM ISTUpdated : Mar 26, 2018, 12:00 AM IST
ఆంధ్రా గవర్నమెంట్లో "లోకం చుడుతున్న వీరుడు "

సారాంశం

ఈ  అధికారి ఎక్కడున్నా విదేశీ ప్రయాణ యోగం తప్పనిసరి మొదటి దశలో అమరావతి పేరు మీద,  ఇపుడేమో టూరిజం ప్రమోషన్ అంటూ...

ఈ అధికారి  చిన్న వయసులో లోకం చుట్టిన వీరుడువు తున్నాడు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఐఎఎస్ అధికారి  నాగులపల్లి శ్రీకాంత్ (1998 బ్యాచ్)  ఇపుడు రెండోధఫా ప్రపంచయాత్రకి సిధ్దమవుతున్నారు.

 

 మొదటి దశలో ఆయన అమరావతి క్యాపిటల్ రీజియన్ డెవెలప్ మెంట్ అధారిటీ (సిఆర్ డిఎ) కమిషనర్ గా  దాదాపు అన్ని ఖండాలలో ఉన్న  కొత్త రాజధానుల నిర్మాణాలు  పరిశీలించివచ్చారు. అయితే,  రాజధానుల గురించి  నేర్చుకున్నది  , ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో ఉపయోగించుకొనక ముందే ఆయనను సిఆర్ డి ఎ నుంచి అర్ధాంతరంగా తప్పించారు. టూరిజం కార్యదర్శిగా నియమించారు.

 

ఉన్నత స్థాయి బృందాలతోనే కాకుండా స్వయంగా కూడా అనేక రాజధాని నగరాలను పరిశీలించి వచ్చారు. ఆయన తిరిగిన దేశాలలో ఛైనా, జపాన్, సింగపూర్, ఉజ్బెకిస్తాన్, యు ఎ ఇ తదితరాలున్నాయి. ఆయనతోపాటు, ముఖ్యమంత్రికి ముఖ్యులయిన వాళ్లంతా ఈ దేశాలన్నీ తిరిగి అక్కడ రాజధానులను, నగర నిర్మాణాన్ని ’ అధ్యయనం’ చేసి వచ్చారు. అధికారులే కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, మునిసిపల్ మంత్రి నారాయణ కూడ  గత రెండు దశాబ్దాలలో నిర్మించిన అనేకనూతన నగరాలను పరిశీలించారు.

 

ఇపుడు సిఆర్ డిఎ నుంచి పర్యాటక శాఖకు బదిలీ అయి వచ్చాక శ్రీకాంత్ రెండో రౌండ్ ప్రపంచ పర్యటనకు వెళుతున్నారు. ఈ సారి ఇంగ్లండ్, స్పెయిన్,జర్మనీలలో పర్యటిస్తున్నారు. ఆయనతో పాటు టూరిజం డెవెలప్ మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గిరిజా శంకర్  లండన్, దుబాయ్ లలో పర్యటిస్తారు.  టూరిజం కమిషనర్ ఆర్ ఫి ఖజూరియా, సాంస్కృతిక విభాగం డైరెక్టర్ విజయకుమార్ లు విదేశాలలో పర్యటించి అనేక టూరిజం సంబంధ కార్యక్రమాలను తిలకిస్తారు. వీరిద్దరు చైనా షాంగై  లో జరిగిన  ఇంటర్నేషనల్ ట్రావెల్ మార్ట్ కార్యక్రమాలలో పాల్గొంటారు.

 

ఇంత వరకు అమరావతి నిర్మాణం కోసం   ’న్యూ ఐడియా’లను వెదుక్కుంటూ అధికారులు ప్రపంచమంతా చక్కర్లు కొట్టి వచ్చినా, నిర్మాణం మొదలయ్యే లోపు వీరిలో కొందరు రిటైర్ కావచ్చు, బదిలీ కావచ్చు.

 

 

 

 





 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబుపై శివరాజ్ సింగ్ పొగడ్తలు | Shivraj Singh Speech | Asianet Telugu
బుర్రిపాలెంని ఉర్రుతలూగించిన బాబు ఉరమాస్ స్పీచ్ | Chandrababu Buripalem Speech | Asianet Telugu