చింతకాయల అయ్యన్న పాత్రుడు: బాల్యం, విద్యాభ్యాసం, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం  

By Rajesh KarampooriFirst Published Mar 26, 2024, 1:54 AM IST
Highlights

Chintakayala Ayyanna Patrudu Biography: తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు, పార్టీకి అత్యంత విశ్వస పాత్రుడు ఆయనే చింతకాయల అయ్యన్నపాత్రుడు. ఎన్టీఆర్, చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన ఆయన ..సొంతం ఎన్నో ఆటుపోట్లు తలెత్తిన పార్టీనే అంటిపెట్టుకొని ఉన్న నాయకుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు వ్యక్తిగత, రాజకీయ జీవితం గురించి తెలుసుకుందాం.

Chintakayala Ayyanna Patrudu Biography: తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు, పార్టీకి అత్యంత విశ్వస పాత్రుడు ఆయనే చింతకాయల అయ్యన్నపాత్రుడు. ఎన్టీఆర్, చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన ఆయన ..సొంతం ఎన్నో ఆటుపోట్లు తలెత్తిన పార్టీనే అంటిపెట్టుకొని ఉన్న నాయకుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు వ్యక్తిగత, రాజకీయ జీవితం గురించి తెలుసుకుందాం.

బాల్యం, విద్యాభ్యాసం 

చింతకాయల అయ్యన్నపాత్రుడు సెప్టెంబర్ 4 1957న విశాఖ జిల్లాలోని నర్సీపట్నంలో జన్మించారు.  ఆయన తండ్రి వరహాలు దొర.  అయ్యన్నపాత్రుడుకు ఐదుగురు సోదరులు. ఇక ఆయన  విద్యాభ్యాసం విషయానికి వస్తే.. ఆ చదువు అంత జిల్లాలోని జరిగింది. పాఠశాల విద్య నర్సీపట్నంలో జరగగా .. కాకినాడలోని పిఆర్ గవర్నమెంట్ కాలేజీ లో బిఎ పూర్తి చేశారు. ఇక ఆయన తాతయ్య  రాజకీయాల్లోనే క్రియాశీలకంగా ఉంటూ పలుపదువులను అలంకరించారు.  అయితే.. తన తండ్రి మాత్రం రాజకీయాల్లోకి రాలేదు.ఇక అయ్యన్నపాత్రుడు జూన్ 1, 1983న పద్మావతి గారిని వివాహం చేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు విజయ్, రెండో కుమారుడు రాజేష్ విజయ్. వీరు టిడిపి సోషల్ మీడియా ఐటి విభాగంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయన్న పెద్ద కుమారుడు రాజకీయాల్లో చాలా యాక్టివ్ గా ఉంటారు. అయ్యన్న కుటుంబానికి పలు వ్యాపారాలు కూడా ఉన్నాయి. 

రాజకీయ ప్రవేశం

అయ్యన్న పాత్రుడు రాజీకియ జీవితం విద్యార్థి దశ నుంచే ప్రారంభమైందని చెప్పాలి. ఎన్టీఆర్  ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ విధానాలు సిద్ధాంతాలు నచ్చి అయ్యన్నపాత్రుడు తెలుగుదేశం పార్టీలో చేరారు. 1983లో జరిగిన ఎన్నికల్లో అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం నుంచి టిడిపి తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో రామచంద్రరాజు పై 9వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇలా యువ నాయకుడిగా అసెంబ్లీలో తొలిసారి అడుగు పెట్టారు. 1984లో ఆయనను ఎన్టీఆర్ తన మంత్రివర్గంలో తీసుకున్నారు.  సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఈ సమయంలో అయ్యన్న స్థానికంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ ఏర్పాటుకు కృషిచేశారు. దీంతో పాటు ప్రభుత్వ సాంకేతిక శిక్షణ సంస్థ, డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశారు.

1985 ఎన్నికల్లో ఆయన మళ్లీ నర్సీపట్నం నుంచి పోటీ చేశారు. ఈసారి శ్రీరామ్ మూర్తిపై గెలిచారు. ఈ సమయంలో నియోజకవర్గం పలు అభివృద్ధి పనులు చేశారు.  కానీ, 1989 ఎన్నికల్లో నర్సీపట్నం నుంచి మూడోసారి పోటీ చేసిన అయ్యన్న ఈ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. 

ఇక 1994 ఎన్నికల్లో జరిగిన ఎన్నికల్లో అయన్న మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కృష్ణమూర్తి రాజు పై 20 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈ సమయంలో అంటే..  1994- 96 మధ్యకాలంలో  రహదారులు, భవనాల శాఖ మంత్రిగా పనిచేస్తారు. అప్పట్లో నియోజకవర్గ పరిధిలోని మారుమూల గ్రామాల పరిధిలో వందల కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్డు ను ఆర్ఎంపీకి బదలాయించి అభివృద్ధి పరిచారు.

ఇక 1996లో 11వ లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున అనకాపల్లి లోక్ సభ సభ్యుడిగా పోటీ చేసి ఆయన తొలిసారిగా ఎంపీగా గెలుపొందారు. 1999లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఈసారి 8559 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈ ఎన్నికల్లో  టీపీడీకి అత్యధిక సీట్లు రావడంతో అయన్న పాత్రుడికి  అటవీశాఖ మంత్రి దక్కింది.

ఆ సమయంలో నియోజకవర్గంలోని పెడిమికొండ నర్సరీ, ఆరిలోవ జౌషధ మొక్కల పెంపకానికి ప్రత్యేక నిధులు కేటాయించారు. 2004 ఎన్నికల్లో అయ్యన్న ఎమ్మెల్యేగా విజ యం సాధించినా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఖాళీగానే ఉండిపోయారు. ఆ తరువాత 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ముత్యాలపాప చేతిలో అయ్యన్న ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికలలో శాసనసభ్యునిగా విజయం సాధించి మంత్రివర్గంలో నియమించబడ్డారు.

click me!