జగన్ పై దాడి కేసులో ఎన్ఐఎ విచారణ: శ్రీనివాసరావుకు ఆంధ్ర భోజనం

By pratap reddyFirst Published Jan 17, 2019, 12:08 PM IST
Highlights

శ్రీనివాస రావు కస్టడీ ఈ నెల 18వ తేదీన ముగుస్తుంది. ఈలోగా గానీ 18వ తేదీ తర్వాత గానీ అజిత్ మిట్టల్ విశాఖ వెళ్లనున్నారు. గురువారంనాడు కూడా ఎన్ఐఎ అధికారులు శ్రీనివాస రావును విచారిస్తున్నారు. 

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడిపై ఎన్ఐఎ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. గత ఐదు రోజులుగా తమ కస్టడీలో ఉన్న నిందితుడు శ్రీనివాస రావును విచారిస్తోంది. తాజాగా, ఎన్ఐఎ ఐజి మిట్టల్ కూడా శ్రీనివాస రావును బుధవారంనాడు విచారించారు. 

శ్రీనివాస రావు కస్టడీ ఈ నెల 18వ తేదీన ముగుస్తుంది. ఈలోగా గానీ 18వ తేదీ తర్వాత గానీ అజిత్ మిట్టల్ విశాఖ వెళ్లనున్నారు. గురువారంనాడు కూడా ఎన్ఐఎ అధికారులు శ్రీనివాస రావును విచారిస్తున్నారు.  ఈ నెల 18వ తేదీలోగా జగన్ పై దాడి కేసు ఓ కొలిక్కి వస్తుందని ఎన్ఐఎ అధికారులు భావిస్తున్నారు.
 
శనివారమే శ్రీనివాసరావును ఎన్ఐఎ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. శని, ఆదివారాల్లో అతన్ని విశాఖలో విచారించారు. రెండు రోజుల తర్వాత హైదరాబాద్‌లోని ఎన్‌ఐఏ కార్యాలయానికి తీసుకువచ్చారు. సోమవారం నుంచి న్యాయవాదుల సమక్షంలో విచారిస్తున్నారు.

కోర్టు నిబంధనల ప్రకారం నిందితుడు శ్రీనివాసరావుకు ప్రతీ 48 గంటలకు ఓసారి వైద్యపరీక్షలు నిర్వహించాలి. దీంతో తమ కస్టడీలో ఉన్న శ్రీనివాసరావును 48 గంటలకోసారి గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయిస్తున్నారు. అలా ఇప్పటివరకు రెండు విడతలుగా వైద్యపరీక్షలు చేయించారు. 

భోజనం సమయంలో శ్రీనివాసరావు కోరుకున్న ఆంధ్రా భోజనాన్ని తెప్పించి అందిస్తున్నారు. ఎన్‌ఐఏకు చెందిన ఎస్పీ స్థాయి అధికారితో పాటు మరో అయిదుగురు అధికారులు శ్రీనివాసరావును ప్రశ్నిస్తున్నట్లు న్యాయవాదులు చెబుతున్నారు.
 
జగన్ పై దాడి కేసు రాజకీయ పరంగానూ కీలకంగా మారడంతో ఎన్ఐఏ అధికారులు నిర్వహిస్తున్న విచారణ మొత్తాన్ని ఆడియో రికార్డు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి ఒకరు, ముంబై నుంచి మరొకరు చొప్పున ఎన్ఐఏ అధికారులు హైదరాబాద్ కార్యాలయానికి వచ్చారు. వాళ్ల సమక్షంలోనే విచారణ సాగుతోంది. 

సంబంధిత వార్తలు

జగన్‌పై దాడి: శ్రీనివాసరావు రాసిన 24 పేజీల లేఖలో ఏముందంటే...

కత్తిదాడి: జగన్‌కు ఎన్ఐఏ నోటీసులు

జగన్ పై దాడి: 24 పేజీల లేఖపై ఆరా, లాక్కున్నారని శ్రీనివాస రావు

జగన్‌పై దాడి: జైల్లో 24 పేజీల లేఖ రాసుకొన్న శ్రీనివాసరావు

జగన్‌పై దాడి: గర్ల్‌ఫ్రెండ్స్‌ను ఇంప్రెస్ చేసేందుకే ఇలా...

జగన్‌పై దాడి: విశాఖకు శ్రీనివాసరావును తరలించనున్న ఎన్ఐఏ

click me!