వైసీపీలో చేరికపై టీడీపీ ఎమ్మెల్యే మేడా సంచలన వ్యాఖ్యలు

sivanagaprasad kodati |  
Published : Jan 17, 2019, 12:00 PM IST
వైసీపీలో చేరికపై టీడీపీ ఎమ్మెల్యే మేడా సంచలన వ్యాఖ్యలు

సారాంశం

 ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, అయితే సొంతపార్టీలోని వారే తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, అలాంటి వారి వల్ల తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతుందని మేడా ఆవేదన వ్యక్తం చేశారు. తాను వైసీపీలో చేరుతున్నట్టు పుకార్లు పుట్టిస్తున్నారని, తన ఎదుగుదల చూసి కొందరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. 

2014 అసెంబ్లీ ఎన్నికల్లో కడప జిల్లా మొత్తం వైసీపీ గాలి వీచినా రాజంపేటలో మాత్రం ఫ్యాన్ తిరగలేదు. జగన్ ప్రభంజనాన్ని అడ్డుకున్న అక్కడి ప్రజలు టీడీపీ నేత మేడా మల్లిఖార్జునరెడ్డికి పట్టం కట్టారు. జిల్లా పార్టీలో కీలకనేతగా వ్యవహరిస్తున్న మేడాపై ఫోకస్ పెట్టిన జగన్ ఆయన్ను ఎలాగైనా వైసీపీలోకి లాగాలని ప్రయత్నిస్తున్నట్టుగా ప్రచారం జరిగింది.

దీనిపై మేడా మల్లిఖార్జున్ రెడ్డి స్పందించారు. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, అయితే సొంతపార్టీలోని వారే తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, అలాంటి వారి వల్ల తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతుందని మేడా ఆవేదన వ్యక్తం చేశారు.

తాను వైసీపీలో చేరుతున్నట్టు పుకార్లు పుట్టిస్తున్నారని, తన ఎదుగుదల చూసి కొందరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఒకవేళ తాను నిజంగా పార్టీని వీడదలుచుకుంటే స్వయంగా సీఎంకే చెప్పి.. తప్పుకుంటానే తప్ప ఇలా చేయనని స్పష్టం చేశారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్