దారుణం.. గవర్నమెంట్ స్కూల్ టీచర్ హత్య.. విజయనగరంలో ఘటన

Published : Jul 16, 2023, 06:53 AM IST
దారుణం.. గవర్నమెంట్ స్కూల్ టీచర్ హత్య.. విజయనగరంలో ఘటన

సారాంశం

ఏపీలోని విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. ఓ టీచర్ హత్యకు గురయ్యాడు. ఆయన బైక్ ను వెనక నుంచి ఢీకొనడంతో తీవ్ర గాయాలతో బాధితుడు చనిపోయారు. 

విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. ఓ గవర్నమెంట్ టీచర్ ను పలువురు ఘోరంగా హతమార్చారు. ఆయన విధుల నిమిత్తం స్కూల్ కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజాంలో 58 ఏళ్ల ఏగిరెడ్డి కృష్ణ నివసిస్తున్నారు. ఆయన తెర్లాం మండలంలోని కాలంరాజుపేటలోని గవర్నమెంట్ స్కూల్ లో టీచర్ గా పని చేస్తున్నారు. అయితే ఎప్పటిలాగే శనివారం కూడా స్కూల్ కు వెళ్లేందుకు ఆయన బైక్ బయలుదేరాడు.

వావ్.. చంద్రయాన్ -3 ప్రయోగాన్ని విమానంలో నుంచి వీడియో తీసిన ప్రయాణికుడు.. వైరల్

అయితే ఒమ్మి సమీపంలోని కొత్తపేట వద్దకు బైక్ చేరుకోగానే ఓ బొలెరో వాహనం ఆయన బైక్ ను ఢీకొట్టింది. దీంతో ఆయన కిందపడిపోయాడు. కొంత దూరం ఆయనను ఈడ్చుకెళ్లి రాడ్ తో తలపై కొట్టినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారని పోలీసులు చెప్పారు. దీంతో బాధితుడు అక్కడికక్కడే మరణించాడు. ఘటనా స్థలంలో ఉన్న పరిస్థితిని గమనించి ఇది హత్య అని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పేర్కొంటూ అక్కడే ఆందోళన చేపట్టారు. 

చిరుత అనారోగ్యంగా ఉందని, బైక్ పై ఎక్కించుకొని హాస్పిటల్ కు తీసుకెళ్లిన యువకుడు.. నోరెళ్లబెట్టిన జనంపోలీసుల ప్రాథమిక విచారణలో ఇది హత్య అని, కానీ రోడ్ యాక్సిండెంట్ గా సీన్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నించారని తేలింది. కృష్ణ కుమారుడు శ్రావణ్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు పలువురిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపడుతున్నట్టు సీఐ రవి కుమార్ పేర్కొన్నారు. డెడ్ బాడీనికి పోస్టుమార్టం కోసం రాజాంలోని గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించామని చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్