అశోక్ గజపతి రాజుకు స్వాగతం.. అర్చకులకు నోటీసులు, జగన్ ప్రభుత్వంపై టీడీపీ ఆగ్రహం

Siva Kodati |  
Published : Jul 15, 2023, 05:59 PM IST
అశోక్ గజపతి రాజుకు స్వాగతం.. అర్చకులకు నోటీసులు, జగన్ ప్రభుత్వంపై టీడీపీ ఆగ్రహం

సారాంశం

టీడీపీ నేత, మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజుకు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులకు ప్రభుత్వం నుంచి షోకాజ్ నోటీసులు వెళ్లడం ఏపీలో కలకలం రేపుతోంది. 

టీడీపీ నేత, మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజుకు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులకు ప్రభుత్వం నుంచి షోకాజ్ నోటీసులు వెళ్లడం ఏపీలో కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న భవిష్యత్‌కు గ్యారెంటీ బస్సు యాత్రలో భాగంగా రామతీర్ధం కూడలిలో అశోక్‌ను ఆరుగురు అర్చకులు ఆశీర్వదించారు. దీనిపై రామతీర్ధం ఆలయ ఈవో కిషోర్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అశోక్ గజపతి రాజుకు పూర్ణ కుంభంతో స్వాగతం పలకడంతో పాటు ఆశీర్వదించిన అర్చకులకు ఆయన షోకాజ్ నోటీసులు పంపారు. తమకు సమాచారం ఇవ్వకుండా టీడీపీ నేతలకు ఎలా స్వాగతం పలుకుతారంటూ ఈవో నోటీసుల్లో ప్రశ్నించారు. దీనిపై వివరణ ఇవ్వాలని ఆయన ఆదేశించారు. మరోవైపు.. అర్చకులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు ఇవ్వడంపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వైసీపీ నేతలకు దమ్ముంటే తమతో పోరాటం చేయాలని.. అంతేకానీ పూజరుల మీద ప్రతాపం చూపుతారంటూ నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ బంగార్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

PREV
click me!

Recommended Stories

Minister Narayana: అమరావతికి కొత్త దారి.. పరిశీలించిన మంత్రి నారాయణ | Asianet News Telugu
Tirumala Vaikunta Dwaram: టికెట్ లేని భక్తులకు ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు| Asianet News Telugu