
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (ysr congress party) , సీఎం జగన్‌పై (ys jagan mohan reddy) మండిపడ్డారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (atchannaidu). తాడేపల్లి అరాచకాలు తాలిబాన్లను (talibans) మించిపోతున్నాయని ఆయన ఆరోపించారు. వైసీపీకీ రోజులు దగ్గర పడ్డాయని, రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. టీడీపీ కార్యకర్త సైదాపై వైసీపీ కార్యకర్తల దాడి హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. టీడీపీ కార్యకర్త సైదాపై నాలుగు రోజుల క్రితమే దాడి జరిగినా కేసు పెట్టరా.? అంటూ పోలీసులపై అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఉన్నది కాపాడడానికా..? రెడ్ కార్పెట్ వేసి దాడులు చేయించడానికా అంటూ ఫైర్ అయ్యారు.
వైసీపీ కార్యకర్తలు గుండాగిరి చేస్తున్నా పోలీసులు చోద్యం చూడటమేంటని అచ్చెన్నాయుడు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం వారి కార్యకర్తలతో దాడులు చేయించడం సరికాదని... దాడికి గురైన టీడీపీ కార్యకర్త సైదాకు పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. సైదాపై దాడికి పాల్పడ్డ వారిపై తక్షణమే కేసు నమోదు చేసి.. నిందితులను అరెస్టు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
ALso Read:గుంటూరు జిల్లాలో టీడీపీ నేతపై ప్రత్యర్థుల విచక్షణారహిత దాడి.. వైసీపీ కార్యకర్తల పనేనా?
కాగా.. Guntur జిల్లాలో దారుణం జరిగింది. ఓ TDP నేతపై నడి రోడ్డుపై విచక్షణారహితంగా దాడి(Attack) చేశారు. కర్రలు, రాళ్లతో దాడి చేశారు. బైక్‌పై వస్తున్న ఆయనను అడ్డగించి భౌతిక దాడికి దిగారు. రహదారి మధ్యలో కొందరు ఆయన చేతులు, కాళ్లు పట్టుకుని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయగా.. మరొకరు ఓ రాయితో తీవ్రంగా దాడి చేసే ప్రయత్నం చేశాడు. ఈ ఘటనకు సంబంధించి ఒకరు వీడియో రికార్డు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో (gurazala constituency) ఈ ఘటన చోటుచేసుకుంది. పిడుగురాళ్ల మండలం, తుమ్మలచెరువుకు చెందిన టీడీపీ నేత సైదాబిపై ఈ దాడి జరిగింది. ఆయన ఓ పెళ్లి వేడుకకు బైక్ పై వెళ్లి వస్తుండగా కొందరు అడ్డుకున్నారు. ఆయనపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. తనపై వైసీపీ కార్యకర్తలే దాడి చేశారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపణలు చేజవారు. పొలానికి సంబంధిచిన దారి విషయంలోనే వారు కావాలనే తన తండ్రి సైదాబితో గొడవ పడ్డారని కొడుకు జిలాని ఆరోపించారు. తీవ్ర గాయాలపాలైన సైదాబిని నరసరావు పేటలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు చికిత్స కోసం తరలించారు. ప్రస్తుతం అదే హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.