సీఆర్‌డీఏ రద్దు ఉపసంహరణ.. మంగళగిరి తాడేపల్లి కార్పోరేషన్‌‌కు సంబంధం లేదు: ఆర్కే

By Siva KodatiFirst Published Nov 24, 2021, 7:53 PM IST
Highlights

తమ హయాంలో అర్హులైన ప్రతిలబ్దిదారునికి స్థలం కేటాయించి న్యాయం చేశామన్నారు వైసీపీ (ysrcp) నేత, మంగళగిరి ఎమ్మెల్యే (mangalagiri mla) ఆళ్ల రామకృష్ణారెడ్డి (alla ramakrishna reddy) .అసెంబ్లీలో ఉపసంహరించుకున్న మూడు రాజధానులు (ap three capitals) , సీఆర్‌డీఏ (crda) బిల్లులతో నూతనంగా ఏర్పడిన మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్‌కి (mangalagiri tadepalli municipal corporation) ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. 

తమ హయాంలో అర్హులైన ప్రతిలబ్దిదారునికి స్థలం కేటాయించి న్యాయం చేశామన్నారు వైసీపీ (ysrcp) నేత, మంగళగిరి ఎమ్మెల్యే (mangalagiri mla) ఆళ్ల రామకృష్ణారెడ్డి (alla ramakrishna reddy) . బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. విజిటింగ్ ప్రొఫెసర్ లాగా అప్పుడప్పుడు వచ్చే లోకేష్‌కి (nara lokesh) తాము చేసిన అభివృద్ధి ఎక్కడ కనపిస్తుందంటూ ఆర్కే ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో ఉపసంహరించుకున్న మూడు రాజధానులు (ap three capitals) , సీఆర్‌డీఏ (crda) బిల్లులతో నూతనంగా ఏర్పడిన మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్‌కి (mangalagiri tadepalli municipal corporation) ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. 

రెండున్నర సంవత్సరాలలో మంగళగిరి నియోజకవర్గంలో తమ ప్రభుత్వంలో 300 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశానని రామకృష్ణారెడ్డి అన్నారు. గతంలో అధికారంలో ఉండి ఈ ప్రాంతంలోనే ఉంటూ ఎలాంటి అభివృద్ధి చేయని చంద్రబాబు (chandrababu naidu) , నారా లోకేష్‌కు ప్రజలు బుద్ధి చెప్పారని ఆర్కే దుయ్యబట్టారు. తాము చేసిన అభివృద్ధిపై డేటా కావాలన్నా, నివేదిక కావాలన్నా ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆళ్ల రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. 

ALso Read:ఓటమికి భయపడే.. మూడు రాజధానుల నుంచి వెనక్కి: జగన్‌ నిర్ణయంపై పవన్ వ్యాఖ్యలు

కాగా.. మూడు రాజధానుల బిల్లులు వెనక్కి తీసుకోవడంపై అసెంబ్లీలో (ap assembly) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. విస్తృత, విశాల ప్రయోజనాలు కాపాడేందుకే బిల్లును వెనక్కి తీసుకున్నట్లు సీఎం వెల్లడించారు. వికేంద్రీకరణ బిల్లు  ఆమోదించిన వెంటనే ప్రక్రియ ప్రారంభమై వుంటే మంచి ఫలితాలు వచ్చి వుండేవని జగన్ అభిప్రాయపడ్డారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే వికేంద్రీకరణ బిల్లు పెట్టామని సీఎం స్పష్టం చేశారు. 3 రాజధానులపై మరింత మెరుగైన బిల్లు తీసుకొస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు. రాజధాని చట్టాల ఉపసంహరణ తాత్కాలికమేనని ఆయన చెప్పారు. 

అమరావతిలో రాజధాని, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు లక్షల కోట్లు ఖర్చవుతుందని సీఎం అన్నారు. రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు ఇవ్వడానికి డబ్బులు లేకపోతే రాజధాని ఊహా చిత్రం ఎలా సాధ్యమవుతుందని జగన్ ప్రశ్నించారు. ప్రజలను తప్పుదోవ పట్టించడం సమంజసమేనా? మనకు, మన పిల్లలకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి? పిల్లలందరూ పెద్ద నగరాలైన హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలకు వెళ్లాల్సిందేనా అని ఆయన నిలదీశారు. ప్రస్తుతంలో ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద నగరం విశాఖ అని.. అక్కడ అన్నీ వసతులు ఉన్నాయని జగన్ చెప్పారు. వాటికి అదనపు హంగులు దిద్దితే, ఐదారేళ్ల తర్వాత అయినా హైదరాబాద్‌ వంటి నగరాలతో పోటీ పడే అవకాశం ఉంది అని సీఎం జగన్‌ ఆకాంక్షించారు. ఆ తర్వాత గతంలో సీఆర్‌డీఏను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరిస్తున్నట్లు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. 

 

"

click me!