పట్టాభిని హాస్పిటల్ కు తరలిస్తుండగా ఉద్రిక్తత... అడ్డుకున్న టిడిపి శ్రేణులు... ఈడ్చుకెళ్లిన పోలీస్ బలగాలు

By Arun Kumar PFirst Published Oct 21, 2021, 1:34 PM IST
Highlights

బుధవారం రాత్రి అరెస్ట్ చేసిన టిడిపి నేత కొమ్మారెడ్డి పట్టాభిరాంను తాజాగా వైద్య పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా ఉద్రిక్తత చోటుచేసుకుంది.  

విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిని కొమ్మారెడ్డి పట్టాభిరాం ను బుధవారం రాత్రి అరెస్ట్ చేసిన పోలీసులు తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించిన విషయం తెలిసిందే. ఇవాళ(గురువారం) అతడిని వైద్యపరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో pattabhi ని పోలీస్ వాహనాలను టిడిపి శ్రేణులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. 

పోలీస్ స్టేషన్ నుండి ప్రత్యేక వాహనంలో పట్టాభి తరలిస్తున్నట్లు తెలుసుకున్న TDP శ్రేణులు అడ్డుకోడానికి ప్రయత్నించారు. తమకు పట్టాభిని చూపించాలంటు పోలీస్ కాన్వాయ్ ని అడ్డుకున్నారు. దీంతో వారిని పోలీసులు వారిని ఈడ్చుకుంటూ పక్కకు తీసుకెళ్లారు. పోలీసులు, టిడిపి శ్రేణుల మధ్య తోపులాట చోటుచేసుకుని కాస్సేపు ఉద్రిక్తత ఏర్పడింది. 

ఇదిలావుంటే టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని కూడా అమరావతికి వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. తాను ఓ ఎమ్మెల్యేగా సెక్రటేరియట్ కు వెళుతున్నానని...ఎందుకు అడ్డుకుంటున్నారని గోరంట్ల పోలీసులతో వాగ్వాదానికి దిగారు. శాంతిభద్రతల సమస్య వుంది కాబట్టి పంపించడం లేదంటూ ఏలూరు వద్ద gorantla butchaiah ను పోలీసులు అడ్డుకున్నారు. 

read more  నీ తండ్రి, తాత వల్లే కాలేదు...నీవల్లేం అవుతుంది జగన్ రెడ్డి: అచ్చెన్న ఆగ్రహం

బుధవారం రాత్రి kommareddy pattabhi ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను భారీ బందోబస్త్ మధ్య పోలీస్ స్టేషన్‌‌కు తరలించారు. అయితే అరెస్ట్ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై పట్టాభి భార్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తలుపులు పగలగొట్టి మరీ పోలీసులు బలవంతంగా ఇంట్లోకి బలవంతంగా చొచ్చుకువచ్చి అరెస్ట్ చేసారని ఆమె ఆరోపించారు. 

వీడియో

పోలీసులపై తనకు నమ్మకం లేదని.. ఆయనకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని పట్టాభి భార్య కూడా ఆరోపించారు. ఈ విధంగా అరెస్ట్ చేయడంపై కోర్టుకెక్కుతామని ఆమె హెచ్చరించారు. ఎఫ్‌ఐఆర్ కాపీ కూడా చూపించలేదని అన్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పలేదని... ఎఫ్ఐఆర్ కాపీ అడిగితే తర్వాత ఇస్తామన్నారని ఆమె తెలిపారు. మరోవైపు పట్టాభిపై 153 ఏ, 505 (2), 504 (ఆర్/ డబ్ల్యూ), 120 బీ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.  

 కొమ్మారెడ్డి అరెస్ట్ పై స్పందిస్తూ మాజీ మంత్రి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోలీసులపై సీరియస్ అయ్యారు. పట్టాభికి హాని చేయాలని పోలీసులు చూస్తున్నారని... ఆయనకు ఏమైనా అయితే డిజిపి గౌతమ్ సవాంగ్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే బాధ్యత అని లోకేష్ హెచ్చరించారు. 
 

click me!