పట్టాభి బూతులకు చంద్రబాబు డైరెక్షన్.. బాలినేని సంచలన వ్యాఖ్యలు...

By AN Telugu  |  First Published Oct 21, 2021, 12:16 PM IST

andhrapradeshలో కుట్రలు  కుతంత్రాలు చేస్తామంటే ఊరుకోబోమని  తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పట్టాభి అసభ్య పదజాలాన్ని చంద్రబాబు వెనకేసుకొస్తారా?  అని ప్రశ్నించారు.  గతంలో Sectarianism రెచ్చగొట్టడానికి టీడీపీ నేతలు రథాలు తగులబెట్టారని బాలినేని ఎద్దేవా చేశారు.
 


ప్రకాశం :  చంద్రబాబు జీవితమంతా కుట్రలమయం అని ఆంధ్రప్రదేశ్ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..  చంద్రబాబు డైరెక్షన్ లోనే పట్టాభి బూతులు మాట్లాడారని Balineni Srinivas Reddy అన్నారు.  చంద్రబాబు దీక్ష అంటేనే ఒక దొంగ దీక్ష అని మంత్రి బాలినేని విమర్శించారు.

andhrapradeshలో కుట్రలు  కుతంత్రాలు చేస్తామంటే ఊరుకోబోమని  తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పట్టాభి అసభ్య పదజాలాన్ని చంద్రబాబు వెనకేసుకొస్తారా?  అని ప్రశ్నించారు.  గతంలో Sectarianism రెచ్చగొట్టడానికి టీడీపీ నేతలు రథాలు తగులబెట్టారని బాలినేని ఎద్దేవా చేశారు.

Latest Videos

undefined

టిడిపి టెర్రరిస్ట్ పార్టీ లా మారింది :  మంత్రి బొత్స

చంద్రబాబు ఒక Terroristల ప్రవర్తిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో మండిపడ్డారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మాట్లాడుతూ... టీడీపీ టెర్రరిస్ట్ పార్టీల మారిందన్నారు.  ఒక ముఖ్యమంత్రి ని పట్టుకుని బూతులు తిడితే ఊరుకుంటారా?  అని ప్రశ్నించారు.

ప్రస్తుత పరిస్థితులకు chandrababu కారణం కాదా?  అని విమర్శించారు.  రాజకీయాల్లో ఇలా తిట్టడం గతంలో ఎప్పుడూ చూడలేదు అన్నారు.  చంద్రబాబు చరిత్ర మొత్తం కుట్రలమయమేనని అన్నారు.  ఎన్టీఆర్ ను గద్దె దించడానికి ఏం చేశారో అందరికీ తెలుసని మంత్రి Botsa Satyanarayana అన్నారు.  ఏపీలో టీడీపీ ని నిషేధించాలని డిమాండ్ చేస్తామని బొత్స సత్యనారాయణ అన్నారు. 

రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ జనాగ్రహ దీక్షలు..
కాగా, ఏపీ సీఎం ys Jaganపై  టీడీపీ నేతలు అసభ్య పదజాలంతో దూషించడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు, ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు గురువారం నాడు జనాగ్రహ దీక్షలకు దిగారు. 

ఏపీ సీఎం వైఎస్ జగన్ నుTdp అధికార ప్రతినిధి Pattabhi చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ycp janaagraha deekshalu దిగింది. ఈ దీక్షల్లో ఎక్కడికక్కడే మంత్రులు, వైసీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు దీక్షలు నిర్వహించారు.

ప్రకాశం, అనంతపురం, పశ్చిమగోదావరి, కృష్ణా సహా పు జిల్లాల్లో  ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు చేపట్టారు. టీడీపీ నేతల దిష్టిబొమ్మలు దగ్దం చేశారు. టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని పలు చోట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.

శ్రీకాకుళం, కడప జిల్లాల్లో పట్టాభిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు ధర్నాకు దిగారు.తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల్లో కూడ ఆ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి.

నీ తండ్రి, తాత వల్లే కాలేదు...నీవల్లేం అవుతుంది జగన్ రెడ్డి: అచ్చెన్న ఆగ్రహం

టీడీపీ నేతలు, ఆ పార్టీ కార్యాలయాలపై  జరిగిన దాడిని నిరసిస్తూ  ఈ నెల 20న  టీడీపీ ఏపీ బంద్ కు పిలుపునిచ్చింది. అయితే ఈ బంద్ విఫలమైందని ప్రజలు ఎవరూ కూడ ఈ బంద్ లో పాల్గొనలేదని  వైసీపీ విమర్శలు గుప్పించింది.ఇదిలా ఉంటే టీడీపీ కార్యాలయాలపై దాడులు నిరసిస్తూ  Chandrababu అమరావతిలోని పార్టీ కార్యాలయంలోనే 36 గంటల దీక్షకు దిగాడు. 

మరోవైపు పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలపై ఏపీ సీఎం Ys jagan స్పందించారు. సీఎంపై బూతులు మాట్లాడడంపై ఆవేదన వ్యక్తం చేశారు.

click me!