
అమరావతి:ఉనికి కోసం Chandrababu Naidu కుట్రలు చేస్తున్నారని... ఈ కుట్రలో భాగంగానే Pattabhi వ్యాఖ్యలు అని వైసీపీ నేత C. Ramachandraiah ఆరోపించారు.గురువారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును ఏపీ ప్రజలు పూర్తిగా తిరస్కరించారన్నారు.చంద్రబాబు ఎప్పుడూ కొందరు బలి పశువుల్ని తయారు చేసుకొంటాడన్నారు.అందులో పట్టాభి ఒకడన్నారు.
also read:పట్టాభి బూతులకు చంద్రబాబు డైరెక్షన్.. బాలినేని సంచలన వ్యాఖ్యలు...
టీడీపీలో పట్టాభి గొప్ప లీడర్ ఏమీకాదని ఆయన చెప్పారు. సమాజం ప్రశాంతంగా ఉండాలని చంద్రబాబు ఎప్పుడూ కూడా కోరుకోడన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమితో చాలామంది నేతలు, కార్యకర్తలు, టీడీపీని వీడుతున్నారని, దీంతో పట్టాభితో వ్యాఖ్యలు చేయించి రాష్ట్రంలో ఘర్షణ వాతావరణానికి టీడీపీ తెరతీసిందని ఆయన విమర్శించారు.
బాబు జీవితమంతా నేరమయం: మంత్రి అవంతి శ్రీనివాస్
వరుస ఓటములతో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ప్రస్టేషన్ లో ఉన్నాడని ఏపీ మంత్రి Avanthi Srinivas చెప్పారు.దీక్షలకు చంద్రబాబు తన అంతరాత్మకు సమాధానం చెప్పుకోవాలన్నారు. కుట్రలు, కుతంత్రాలకు చంద్రబాబు పెట్టింది పేరు అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు జీవితమంతా నేరమయమని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రిని పట్టాభితో ఈ రకంగా అసభ్య వ్యాఖ్యలు చేయించడం సరైందా అని ఆయన ప్రశ్నించారు.
ఇదిలా ఉంటే టీడీపీ కార్యాలయాలపై దాడులు నిరసిస్తూ చంద్రబాబు అమరావతిలోని పార్టీ కార్యాలయంలోనే 36 గంటల దీక్షకు దిగాడు. మరోవైపు పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలపై ఏపీ సీఎం Ys jagan స్పందించారు. సీఎంపై బూతులు మాట్లాడడంపై ఆవేదన వ్యక్తం చేశారు.. తమ పార్టీ కార్యాలయంపై దాడిపై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు ఆ పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్. ఈ దాడి కి డీజీపీ పర్యవేక్షణ చేశారని ఆయన ఆరోపించారు.