మావోల దుశ్చర్యపై హోంమంత్రి చినరాజప్ప దిగ్భ్రాంతి

By Nagaraju TFirst Published Sep 23, 2018, 3:32 PM IST
Highlights

అరకులో మావోయిస్టుల దుశ్చర్యపై హోంమంత్రి చినరాజప్ప దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమపై మావోల దాడి చేసి హతమార్చడాన్ని చినరాజప్ప ఖండించారు. 

కాకినాడ: అరకులో మావోయిస్టుల దుశ్చర్యపై హోంమంత్రి చినరాజప్ప దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమపై మావోల దాడి చేసి హతమార్చడాన్ని చినరాజప్ప ఖండించారు. నాలుగున్నరేళ్లలో ఓ ప్రజా ప్రతినిధిని చంపడం ఇదే ప్రథమం అని స్పష్టం చేశారు. పోలీసులు చాలా అప్రమత్తంగా ఉన్నప్పటికీ ఘటన జరిగిందన్నారు. 

అరకులో మావోయిస్టుల దాడికి సంబంధించి వైఫల్యాలపై విచారణకు ఆదేశించారు. ఈ వైఫల్యానికి కారణమేంటో తక్షణం విచారించి నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హోంశాఖ మంత్రి తెలిపారు. 

మావోల దాడి రాజ్యాంగ విరుద్ధం: అరకు ఎంపీ కొత్తపల్లి గీత

విశాఖపట్నం: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు దారుణ హత్యపై అరకు ఎంపీ కొత్తపల్లి గీత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మావోయిస్టుల దాడిలో ఎమ్మెల్యే సర్వేశ్వరరావు మృతిచెందడం తీవ్రంగా కలిచివేసిందన్నారు. 

పార్టీలు వేరైనా తమ మధ్య మంచి సాన్నిహిత్యం ఉందని తెలిపారు. మావోయిస్టులు తమ ఉనికి చాటుకోవడం కోసం ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం రాజ్యాంగ విరుద్ధం అని అన్నారు. కిడారి కుటుంబానికి సంతాపం తన సంతాపం ప్రకటించారు.

ఈ వార్తలు కూడా చదవండి

మావోల ఘాతుకంపై లోకేష్ దిగ్భ్రాంతి

ప్రజాప్రతినిధులంతా జాగ్రత్తగా ఉండండి: సీఎం చంద్రబాబు

 

 

click me!
Last Updated Sep 23, 2018, 4:42 PM IST
click me!