మా వూరు ఎప్పుడూ ఏకగ్రీవమే.. కానీ ఫస్ట్ టైమ్, అంతా పోలీసుల వల్లే: అచ్చెన్న కామెంట్స్

Siva Kodati |  
Published : Feb 09, 2021, 09:15 PM IST
మా వూరు ఎప్పుడూ ఏకగ్రీవమే.. కానీ ఫస్ట్ టైమ్, అంతా పోలీసుల వల్లే: అచ్చెన్న కామెంట్స్

సారాంశం

పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ గెలవడానికి పోలీసులే కారణమని ఆరోపించారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన రాజకీయ జీవితంలో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదని ఆరోపించారు. 

తన స్వగ్రామం ఎప్పుడూ ఏకగ్రీవం అయ్యే పంచాయతీ అన్న ఆయన.. ఆడవాళ్లు అని చూడకుండా తమ కుటుంబసభ్యులపై కేసులు పెట్టారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 90 శాతం పోలింగ్ అయ్యే తమ గ్రామంలో పోలీసుల భయంతో తగ్గిందని ఆయన ధ్వజమెత్తారు. 

కాగా నిమ్మాడలో టీడీపీ అభ్యర్ధి సురేశ్ విజయం సాధించారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి 1,827, వైసీపీకి 157 ఓట్లు వచ్చాయి. దాదాపు 40 ఏళ్ల తర్వాత నిమ్మాడలో టీడీపీ గెలుపొందం విశేషం. 

Also Read:ఏపీ పంచాయతీ ఎన్నికలు: అచ్చెన్న ఇలాఖాలో టీడీపీ పాగా.. 40 ఏళ్ల తర్వాత గెలుపు

పంచాయతీ ఎన్నికల సందర్భంగా నిమ్మాడలో అచ్చెన్నాయుడి కుటుంబం 40 సంవత్సరాలుగా ఏకగ్రీవంగా గెలుస్తూ వస్తోంది. కింజరాపు కుటుంబ సభ్యులు, బంధువులు సర్పంచ్‌గా ఎన్నికవుతూ వస్తున్నారు.

ఈ ఆనవాయితీకి ఈ సారి బ్రేక్ పడింది. వైఎస్సార్సీపీ తరఫున కింజరాపు కుటుంబానికే చెందిన అప్పన్న నామినేషన్ వేయడంతో పోటీ అనివార్యమైంది. తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థిపై కింజరాపు అప్పన్న నామినేషన్ వేశారు.

ఆయన నామినేషన్ వేయడాన్ని అడ్డుకోవడంలో భాగంగా బెదిరింపులకు పాల్పడ్డారనే కారణంతో అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనకు బెయిల్ లభించింది.

PREV
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu
CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu