పంచాయతీ ఎన్నికలు: ఫలితాల్లో వైసీపీ హవా.. 95 స్థానాలు మావేనన్న బొత్స

By Siva KodatiFirst Published Feb 9, 2021, 8:35 PM IST
Highlights

ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం.. ఫలితాల్లో వైసీపీ జోరు కనిపిస్తోంది. 813కి పైగా పంచాయతీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి

ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం.. ఫలితాల్లో వైసీపీ జోరు కనిపిస్తోంది. 813కి పైగా పంచాయతీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి.

వీటిలో వైసీపీ బలపరిచిన అభ్యర్ధులు దూసుకెళ్తున్నారు. వైసీపీ మద్ధతున్న 710 మంది గెలుపొందగా, 87 చోట్ల టీడీపీ బలపరిచిన అభ్యర్ధులు గెలిచారు. ఇక చిత్తూరు జిల్లాలో జనసేన ఓ పంచాయతీనిని గెలుచుకుంది.

ఫలితాలపై మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఈ ఫలితాల ద్వారా ప్రజలు జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని విశ్వసిస్తున్నారని అర్థమైందన్నారు. ప్రభుత్వ పనితీరుని ఆశీర్వదిస్తున్నారనడానికి ఇది నిదర్శనమని బొత్స వ్యాఖ్యానించారు.

గత పదిరోజులుగా ఎన్నికలు పెట్టండి తేల్చేస్తామని చంద్రబాబు నాయుడు, మిగిలిన నాయకులు హడావిడి చేశారని బొత్స ఎద్దేవా చేశారు. వాస్తవాలు తమకు తెలుసునని.. అయితే కరోనా వుంది కాబట్టే తమ ప్రభుత్వం ఎన్నికలు వద్దని చెప్పిందని మంత్రి వెల్లడించారు.

మధ్యవర్తులు, దళారులు లేకుండా అందరి సంక్షేమం కోసం జగన్ పాటుపడుతున్నారని బొత్స స్పష్టం చేశారు. ప్రజలు సంక్షేమాన్ని కాదనుకుంటారా అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.

తెల్లవారుజామున 4 గంటలకే వృద్ధులు, వితంతువులు, వికలాంగులకి పెన్షన్ ఇచ్చిన చరిత్ర ఆంధ్రప్రదేశ్‌దేనని ఆయన గుర్తుచేశారు. 95 శాతం స్థానాల్లో వైసీపీ గెలుస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. 

click me!