కొత్తగా 70 మందికి పాజిటివ్, చిత్తూరులో అత్యధికం: ఏపీలో 8,88,555కి చేరిన కేసులు

Siva Kodati |  
Published : Feb 09, 2021, 07:27 PM ISTUpdated : Feb 09, 2021, 07:28 PM IST
కొత్తగా 70 మందికి పాజిటివ్, చిత్తూరులో అత్యధికం: ఏపీలో 8,88,555కి చేరిన కేసులు

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గిపోతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 70 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 8,88,555కి చేరుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గిపోతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 70 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 8,88,555కి చేరుకుంది. కరోనా కారణంగా నిన్న ఏ ఒక్కరు మరణించలేదని ప్రభుత్వం తెలిపింది. వైరస్ బారినపడి ఇప్పటి వరకు రాష్ట్రంలో 7,160 మంది మరణించారు.

నిన్న ఒక్క రోజు రాష్ట్రంలో 115 మంది కరోనా నుంచి కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటి వరకు డిశ్చార్జ్‌ల సంఖ్య 8,80,478కి చేరింది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 917 మంది చికిత్స పొందుతున్నారు.

గడిచిన 24 గంటల్లో 26,844 మందికి కోవిడ్ నిర్థారణా టెస్టులు చేయడంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,33,94,460 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.

గత 24 గంటల్లో అనంతపురం 1, చిత్తూరు 24, తూర్పుగోదావరి 11, గుంటూరు 8, కడప 4, కృష్ణ 9, కర్నూలు 0, నెల్లూరు 0, ప్రకాశం 1, శ్రీకాకుళం 1, విశాఖపట్నం 10, విజయనగరం 1, పశ్చిమ గోదావరిలలో 0 కేసులు నమోదయ్యాయి. 

PREV
click me!

Recommended Stories

Weather Update: ఏపీ, తెలంగాణలో మారిన వాతావరణం.. 15 జిల్లాలకు హై అలర్ట్.. అక్కడ తుపాను గండం
అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu