AP Polycet 2025 Results:ఏపీ పాలిసెట్‌ 2025 ఫలితాల్లో 95.36% ఉత్తీర్ణత, ర్యాంకు కార్డుల డౌన్‌లోడ్ ఇలా చేసుకోండి

Published : May 14, 2025, 08:54 PM IST
AP Polycet 2025 Results:ఏపీ పాలిసెట్‌ 2025 ఫలితాల్లో 95.36% ఉత్తీర్ణత, ర్యాంకు కార్డుల డౌన్‌లోడ్ ఇలా చేసుకోండి

సారాంశం

AP Polycet 2025 Results: ఏపీ పాలిసెట్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. 1.33 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. పాస్ రేటు  95.36 శాతంగా న‌మోదైంది. పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి.  

AP Polycet 2025 Results: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంకేతిక విద్యా-శిక్షణ మండలి (SBTET) బుధవారం (మే 14న) ఏపీ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP POLYCET) 2025 ఫలితాలను విడుదల చేసింది. ఏప్రిల్ 30, 2025న నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ (polycetap.nic.in, http://polycetap.nic.in) ద్వారా తమ ఫలితాలు, ర్యాంక్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్, టెక్నాలజీ డిప్లొమా కోర్సులకు ప్రవేశాలు లభిస్తాయి. 

ఏపీ పాలిసెట్ ఫలితాలు 2025 ఎలా ఉన్నాయి? 

ఈ ఏడాది మొత్తం 1,39,840 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 1,33,358 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 95.36%. బాలికలు 96.9% పాస్ రేటుతో మెరుగైన ఫలితాలు సాధించారు. అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని (98.66%) ఏఎస్‌ఆర్ జిల్లా సాధించింది. మొత్తం 19 మంది విద్యార్థులు పూర్తిగా 120కి 120 మార్కులు సాధించారు.

ఏపీ పాలిసెట్ ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి?  ర్యాంకు కార్డు డౌన్ లోడ్ చేసుకోవ‌డం ఎలా? 

1. అధికారిక వెబ్‌సైట్ polycetap.nic.inకి వెళ్లాలి.
2. “AP POLYCET 2025 Result” లింక్‌ను క్లిక్ చేయాలి.
3. హాల్ టికెట్ నంబర్ సహా అవసరమైన వివరాలు ఎంటర్ చేయాలి.
4. సబ్మిట్ క్లిక్ చేసి ఫలితాన్ని చూడవచ్చు.
5. ర్యాంక్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి.

వాట్సాప్ తో ఏపీ పాలిసెట్ ఫలితాలు 2025

వాట్సాప్ ద్వారా కూడా ఏపీ పాలిసెట్ 2025 ఫలితాలు తెలుసుకోవచ్చు. అభ్యర్థులు 9552300009కి "Hi" అని పంపితే, మన మిత్ర సేవ ద్వారా ఫలితాలు పొందవచ్చు.

ఏపీ పాలిసెట్ ఫలితాలు 2025 త‌ర్వాత ప్ర‌వేశాల ద‌శ‌లు

1. కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్: అధికారిక వెబ్‌సైట్‌లో త్వరలో కౌన్సెలింగ్ తేదీలు ప్రకటించ‌నున్నారు. 

2. డాక్యుమెంట్ వెరిఫికేషన్:

  • హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్
  • 10వ తరగతి మార్క్‌షీట్
  • ఆధార్ కార్డు
  • నివాస ధ్రువీకరణ పత్రం
  • కుల ధ్రువీకరణ పత్రం

3. చాయిస్ ఫిల్లింగ్, సీట్ అలాట్మెంట్ 

4. అడ్మిషన్ కన్ఫర్మేషన్: అలాటైన సీటును స్వీకరించేందుకు ఫీజు చెల్లించి నమోదు ప్రక్రియ పూర్తి చేయాలి. 

ప్రభుత్వం తరపున నారా లోకేష్ ట్వీట్ చేస్తూ, “ఈసారి విజయాన్ని సాధించని వారు నిరుత్సాహ పడకండి. ప్రపంచం అవకాశాలతో నిండి ఉంది” అని అన్నారు.


 

PREV
Read more Articles on
click me!