టీడీపీ ఎజెండాను బీజేపీ అమలు చేస్తోందని ఏపీ రాష్ట్ర మంత్రి పేర్ని నాని విమర్శించారు. టీడీపీ ఎజెండానే బీజేపీ అమలు చేస్తోందన్నారు.బీజేపీని సీఎం రమేష్, సుజనా చౌదరిలకు లీజుకు ఇచ్చారని ఆయన మండిపడ్డారు.
అమరావతి: సుజనా చౌదరి, సీఎం రమేష్ లకు బీజేపీని లీజుకు ఇచ్చారని ఏపీ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని విమర్శించారు.మంగళవారం నాడు ఏపీ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి Perni Nani అమరావతిలో మీడియాతో మాట్లాడారు. పార్టీ పాలసీలను నిర్ణయించేది సుజనా చౌదరి, సీఎం రమేష్‌లేనన్నారు. అమిత్ షా పరిధిలోని అంశాలను సుజా చౌదరి ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు.రాష్ట్రంలో టీడీపీ ఎజెండాను బీజేపీ అమలు చేస్తోందని మంత్రి పేర్ని నాని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న సమయంలో ప్రజాగ్రహ సభను Bjp ఏర్పాటు చేయడంపై ఆయన మండిపడ్డారు. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం వల్లే తమ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు.
also read:ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ను కలిశా.. : విజయ్ సాయి రెడ్డి
బీజేపీ నేతలకు chandrababu ఎజెండా తప్పితే మరో ఎజెండా ఉందా అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ నేతలు ఇష్టారీతిలో మాట్లాడుతున్నారన్నారు. బ్రాందీ ధరలు పెరిగినందుకు కాదు డీజీల్, పెట్రోల్ ధరలు పెరిగినందుకు బీజేపీ నేతలు బాధపడాలని మంత్రి పేర్ని నాని హితవు పలికారు.ఎరువుల ధరలు పెరిగినందుకు బీజేపీ నేతలకు ఎందుకు బాధ లేదని మంత్రి ప్రశ్నించారు. 2014 లో ఎరువుల బస్తా రూ.800 లనుండి ప్రస్తుతం రూ.1700లకు చేరుకొందన్నారు.
Paddy ధాన్యం కొనుగోలు చేయలేమని చెబుతుంది., కొనుగోలు చేసిన ధాన్యం విషయంలో కూడా రాష్ట్రాలకు సవాలక్ష ఇబ్బందులు పెడుతుందన్నారు. తమ ప్రభుత్వం రైతు ప్రభుత్వమన్నారు. Farmer వ్యతిరేక కార్యక్రమాలను బీజేపీ చేపడుతుందన్నారు. నూతన వ్యవసాయ చట్టాలను మరోసారి తీసుకువస్తామని కూడా కేంద్ర మంత్రి ప్రకటించిన విషయాన్ని మంత్రి నాని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఇవాళ రాష్ట్రంలో నిర్వహించే ప్రజాగ్రహ సభలో తాను లేవనెత్తిన అంశాలపై మాట్లాడాలని మంత్రి పేర్ని నాని బీజేపీ నేతలను కోరారు. ప్రజా సమస్యలపై బీజేపీకి దృష్టి లేదన్నారు.జాతీయ పార్టీలతో ప్రాంతీయ పార్టీలు జట్టు కడుతాయి.. కానీ ఏపీలో మాత్రం టీడీపీ కూటమిలో బీజేపీ ఉందని మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు.బీహార్ కు ప్రత్యేక హోదా ఇస్తామని నీతి ఆయోగ్ చెప్పిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. అయితే ఈ విషయాన్ని బీజేపీ చెప్పించలేదా అని మంత్రి ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీని బీజేపీ ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని మంత్రి ప్రశ్నించారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడడం లేదో చెప్పాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఏపీకి చెందిన బీజేపీ నేతలు ఇవాళ ప్రజాగ్రహ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభలో బీజేపీ జాతీయ నాయకుడు ప్రకాష్ జవదేకర్ సహా పలువురు బీజేపీ అగ్ర నేతలు పాల్గొంటారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై బీజేపీ నేతలు ప్రసంగించనున్నారు. తిరుపతిలో గత మాసంలో అమిత్ షా ఏపీకి చెందిన బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళనలు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశం తర్వాత బీజేపీ నేతలు ఇవాళ ప్రజాగ్రహ సభను ఏర్పాటు చేశారు.