చంద్రబాబు అండతోనే టీడీపీ నేతల కబ్జాలు: మంత్రి అవంతి శ్రీనివాస్

Published : Jun 14, 2021, 02:36 PM IST
చంద్రబాబు అండతోనే టీడీపీ నేతల కబ్జాలు: మంత్రి అవంతి శ్రీనివాస్

సారాంశం

చంద్రబాబునాయుడు అండతోనే టీడీపీ నేతలు కబ్జాలు చేస్తున్నారని  ఏపీ రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు. 

విశాఖపట్టణం: చంద్రబాబునాయుడు అండతోనే టీడీపీ నేతలు కబ్జాలు చేస్తున్నారని  ఏపీ రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు. సోమవారంనాడు విశాఖపట్టణంలో ఏపీ రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. తప్పు చేస్తే ఎవరికైనా శిక్షపడాల్సిందేనని ఆయన చెప్పారు. విశాఖలో టీడీపీ నేతలు భూకబ్జాలు చేశారని ఆయన ఆరోపించారు. 

also read:రూ.750కోట్లంటూ ప్రచారం... నిరూపిస్తే రాజకీయ సన్యాసం: పల్లా శ్రీనివాసరావు సవాల్ (వీడియో)

రెవిన్యూ చట్టంలోని లోపాలను ఆసరాగా చేసుకొని ప్రభుత్వ భూములను ఆక్రమించుకొన్నారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఏ పేదవాడు ఇళ్లు లేకుండా ఉండకుండా ఉండాలనేదే జగన్ లక్ష్యమని ఆయన తెలిపారు. కబ్జాకోరులను  వదలబోమని ఆయన హెచ్చరించారు. జీవీఎంసీ పరిధిలోని యుఎల్‌సీ భూములను పల్లా శ్రీనివాసరావు కుటుంబం ఆక్రమించిందని ఆయన ఆరోపించారు. 

also read:త్వరలోనే విశాఖ భూఆక్రమణలపై సిట్ నివేదిక: మంత్రి అవంతి

ప్రభుత్వ భూములు ఆక్రమించిన ఎవరైనా శిక్షలు పడాల్సిందేననేది సీఎం జగన్ అభిమతమని ఆయన చెప్పారు. చంద్రబాబుకు టీడీపీపైనా, ఆ పార్టీ నేతలపై పట్టులేదని ఆయన విమర్శించారు. టీడీపీ ప్రభుత్వ హయంలో విశాఖలో వందలాది ఎకరాలు కబ్జాకు గురయ్యాయని ఆయన చెప్పారు.   కబ్జాకు గురైన భూమిని స్వాధీనం చేసుకొంటే విమర్శలు చేస్తున్నారన్నారు. విశాఖలో ప్రభుత్వ భూముల ఆక్రమణపై సిట్ నివేదిక త్వరలోనే రానుందన్నారు. ఈ నివేదిక ఆధారంగా చర్యలు  తీసుకొంటామని ఆయన చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్