మాన్సాస్ ట్రస్ట్ పై హైకోర్ట్ తీర్పు... జగన్ సర్కార్ కు చెంపపెట్టు..: నారా లోకేష్

By Arun Kumar P  |  First Published Jun 14, 2021, 2:19 PM IST

మాన్సాస్ ట్రస్ట్ విషయంలో తాజాగా హైకోర్టు తీర్పు అప్ర‌జాస్వామికంగా, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ అర్ధ‌రాత్రి చీక‌టి జీవోలు జారీచేస్తోన్న జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారుకి చెంప‌పెట్టని నాారా లోకేష్ అన్నారు. 


గుంటూరు: మాన్సాస్ ట్ర‌స్ట్‌ని చెర‌బ‌ట్టేందుకు ప్ర‌భుత్వం ఇచ్చిన జీవోల‌ను హైకోర్టు కొట్టివేయ‌డంతో ధ‌ర్మం, చ‌ట్టం, న్యాయందే అంతిమ విజ‌యం అని తేలిందన్నారు టిడిపి జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్. ఈ తీర్పు అప్ర‌జాస్వామికంగా, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ అర్ధ‌రాత్రి చీక‌టి జీవోలు జారీచేస్తోన్న జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారుకి చెంప‌పెట్టని అన్నారు. 

''భూములు, వేల కోట్ల ఆస్తులు ప్ర‌జ‌ల కోసం దాన‌మిచ్చిన పూస‌పాటి వంశీకుల దాన‌గుణానికి, స‌త్య‌నిష్ట‌కి న్యాయ‌స్థానం తీర్పు మ‌రింత వ‌న్నెతెచ్చింది. అరాచ‌క ప్ర‌భుత్వ పాల‌న‌పై సింహాచ‌లం అప్ప‌న్న ఆశీస్సులు, ప్ర‌జాభిమానం, చ‌ట్టం, న్యాయం, రాజ్యాంగం సాధించిన విజ‌యం ఇది. న్యాయ‌పోరాటం సాధించిన పెద్ద‌లు అశోక్‌గ‌జ‌ప‌తిరాజు గారికి అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను'' అన్నారు నారా లోకేష్.

Latest Videos

undefined

read more  ఎయిర్ పోర్టులో మంత్రి బుగ్గనకు చేదు అనుభవం.. లోపలికి అనుమతించని వైనం..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం జారీ చేసిన మాన్సాస్ ట్రస్ట్ నియామకం జీవోను ఏపీ హైకోర్టు రద్దు చేసింది. దీంతో వైఎస్ జగన్ ప్రభుత్వానికే కాకుండా మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ గా నియమతులైన సంచయిత గజపతి రాజుకు షాక్ తగిలింది. మాజీ మంత్రి, టీడీపీ నేత పి. అశోక గజపతిరాజుకు ఊరట లభించింది. 

మాన్సాస్ ట్రస్ట్ మీద సంచయిత గజపతిరాజు వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. సంచయితను మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ గా నియమిస్తూ జగన్ ప్రభుత్వం జీవో నెంబర్ 72ను జారీ చేసింది. దాన్ని హైకోర్టు రద్దు చేసింది. దీంతో సంచయిత నియామకం రద్దవుతుంది. 

వరాహలక్ష్మి దేవస్థానం చైర్మన్ గా, మాన్సాస్ ట్రస్టు చైర్మన్ గా పి. అశోక గజపతి రాజు నియామకాన్ని పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశించింది. సింహాచలం ట్రస్టుకు కూడా అశోక గజపతి రాజు చైర్మన్ గా కొనసాగుతారు. మాన్సాస్ ట్రస్టు చైర్మన్ గా అశోక గజపతి రాజును తొలగిస్తూ, సంచయిత గజపతి రాజునుు నియమిస్తూ జారీ చేసిన జీవోపై తీవ్ర వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. 


 

 

click me!