మాన్సాస్ ట్రస్టు చైర్ పర్సన్ గా సంచయిత గజపతి రాజును నియమిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవోను ఏపీ హైకోర్టు రద్దు చేసింది. అశోక్ గజపతి రాజు నియామకాన్ని పునరుద్ధరించాలని ఆదేశించింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం జారీ చేసిన మాన్సాస్ ట్రస్ట్ నియామకం జీవోను ఏపీ హైకోర్టు రద్దు చేసింది. దీంతో వైఎస్ జగన్ ప్రభుత్వానికే కాకుండా మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ గా నియమతులైన సంచయిత గజపతి రాజుకు షాక్ తగిలింది. మాజీ మంత్రి, టీడీపీ నేత పి. అశోక గజపతిరాజుకు ఊరట లభించింది.
మాన్సాస్ ట్రస్ట్ మీద సంచయిత గజపతిరాజు వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. సంచయితను మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ గా నియమిస్తూ జగన్ ప్రభుత్వం జీవో నెంబర్ 72ను జారీ చేసింది. దాన్ని హైకోర్టు రద్దు చేసింది. దీంతో సంచయిత నియామకం రద్దవుతుంది.
వరాహలక్ష్మి దేవస్థానం చైర్మన్ గా, మాన్సాస్ ట్రస్టు చైర్మన్ గా పి. అశోక గజపతి రాజు నియామకాన్ని పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశించింది. సింహాచలం ట్రస్టుకు కూడా అశోక గజపతి రాజు చైర్మన్ గా కొనసాగుతారు. మాన్సాస్ ట్రస్టు చైర్మన్ గా అశోక గజపతి రాజును తొలగిస్తూ, సంచయిత గజపతి రాజునుు నియమిస్తూ జారీ చేసిన జీవోపై తీవ్ర వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.