AP Local body Elections: ఏపీలో కొనసాగుతున్న గ్రామ పంచాయితీ ఎన్నికలు

By narsimha lode  |  First Published Nov 14, 2021, 10:18 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రామ పంచాయితీలకు ఇవాళ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటలకు  పోలింగ్ నిర్వహించనున్నారు.రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న మొత్తం 69 పంచాయతీలకు గానూ 30 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి.


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయితీ ఎన్నికలకు  ఇవాళ పోలింగ్ జరుగుతుంది.ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ మధ్యాహ్నం ఒంటిగంట వరకు సాగనుందిమధ్యాహ్నం రెండు గంటల  తర్వాత కౌంటింగ్ నిర్వహిస్తారు.రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న మొత్తం 69 పంచాయతీలకు గానూ 30 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన పంచాయితీలకు  ఇవాళ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వివిధ జిల్లాలోని 36 సర్పంచ్‌ స్థానాలకు, వివిధ గ్రామాల్లోని 68 వార్డుల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 350 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ జరుగుతోంది. అనంతపురం జిల్లాలో ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. నాలుగు పంచాయతీలకు పోలింగ్ జరుగుతోంది. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఐదు సర్పంచ్ స్థానాలకు 9 వార్డు స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి భారీస్థాయిలో ఓటర్లు తరలివస్తున్నారు. పెదకాకానిలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

also read:ఏపీ స్థానిక ఎన్నికలు: ముగిసిన ప్రచారం.. రేపటి నుంచి ఎలక్షన్స్, కుప్పంపైనే అందరి దృష్టి

Latest Videos

12 మున్సిపాలిటీలు, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, దర్శి, బుచ్చిరెడ్డిపాలెం, కుప్పం, బేతంచెర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండ మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.రాష్ట్రంలో పోటీలో ఉన్న అభ్యర్ధులు మరణించడం లేదా పలు కారణాలతో ఎన్నికలు నిర్వహించని  సంస్థలకు AP Local Body Elections నిర్వహించేందుకు AP SEC నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.ఈ ఎన్నికలకు  ఈ నెల 3న  ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్ 14న గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. మున్సిపాలిటీలు, నెల్లూరు కార్పొరేషన్ లలో నవంబర్ 15న పోలింగ్ నిర్వహించి ఈ నెల 17న ఫలితాలు ప్రకటిస్తారు. గతంలో రద్దయిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నవంబర్ 16న పోలింగ్ నిర్వహించి నవంబర్ 18న ఫలితాలు వెల్లడిస్తారు.

ఈ దఫా కుప్పం మున్సిపాలిటీకి ఎన్నికలు జరగనున్నాయి. కుప్పం మున్సిపాలిటీలో విజయం కోసం టీడీపీ, వైసీపీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధుల కంటే వైసీపీ అభ్యర్దులే ఎక్కువ సంఖ్యలో విజయం సాధించారు. అయితే ఈ దఫా కుప్పం మున్సిపాలిటీపై వైసీపీ జెండా ఎగుర వేసేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అయితే కుప్పంలో తన పట్టును నిలుపుకొనేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. టీడీపీకి చెందిన కీలక నేతలను కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ఇంచార్జీలుగా నియమించారు చంద్రబాబు నాయుడు.

టీడీపీకి చెందిన అభ్యర్ధులను ఫోర్జరీ సంతకాలతో నామినేషన్లను విత్ డ్రా చేయించాడని చంద్రబాబునాయుడు వైసీపీపై విమర్శలు గుప్పించారు.న్యాయస్థానం ఆదేశాలను సైతం ధిక్కరించి వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.  బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ జరిగిందన్నారు.ఈ అంశాలకు సంబంధించి కూడా చంద్రబాబునాయుడు ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖలు రాశారు. అంతేకాదు  రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్  నీలం సహానీకి కూడా ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు.


 

click me!