Visakhapatnam: విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకం.. హోటల్ గదిలో అసలు ఏం జరిగింది..?

Published : Nov 14, 2021, 09:28 AM IST
Visakhapatnam: విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకం.. హోటల్ గదిలో అసలు ఏం జరిగింది..?

సారాంశం

విశాఖపట్నం (visakhapatnam)లోని కరాస ప్రాంతానికి చెందిన ఓ యువతి (20), వరంగల్‌ జిల్లా భూపాలపల్లికి (bhupalpally) చెందిన పలకల హర్షవర్ధన్‌ (21) పంజాబ్‌లోని ఓ కళాశాలలో బీటెక్‌ చదువుతున్నారు. అయితే హర్షవర్దన్‌ యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నట్టుగా చెబుతున్నారు.

ఓ యువతిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన యువకుడు.. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు యత్నించాడు. విశాఖపట్నం (visakhapatnam) సూర్యాబాగ్ ప్రాంతంలోని ఓ హోటల్‌లో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం వారిద్దరికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుంది. వివరాలు..  నగరంలో కరాస ప్రాంతానికి చెందిన ఓ యువతి (20), వరంగల్‌ జిల్లా భూపాలపల్లికి (bhupalpally) చెందిన పలకల హర్షవర్ధన్‌ (21) పంజాబ్‌లోని ఓ కళాశాలలో బీటెక్‌ చదువుతున్నారు. వీరిద్దరికి కాలేజ్‌లో పరిచయం ఉంది. అయితే హర్షవర్దన్‌ యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నట్టుగా చెబుతున్నారు. 

హర్షవర్దన్ శుక్రవారం విశాఖలోని హోటల్‌కు చేరుకున్నాడు. అతడు వచ్చిన విషయం చెప్పి.. మాట్లాడాలని కోరడంతో యువతి కూడా హోటల్‌కు వచ్చింది. అయితే అక్కడ యువతిని తనను పెళ్లి చేసుకోవాలని హర్షవర్దన్ కోరాడు. అయితే అందుకు యువతి నిరాకరించినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే హోటల్‌ల్ గదిలోనే యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం తనపై కూడా పెట్రోల్ (petrol) పోసుకుని నిప్పంటించుకున్నాడు.

Also read: Earthquake: విశాఖలో భూకంపం... ఇళ్లలోంచి బయటకు పరుగుతీసిన ప్రజలు

హోటల్ గదిలో (hotel room) నుంచి అరుపులు, మంటలు రావడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే వారిద్దరిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వివరాలను సేకరించారు. ఇద్దరి శరీరాలు 60 శాతం మేర కాలిపోయినట్టుగా పోలీసులు తెలిపారు. సంఘటన స్థలాన్ని ఇన్‌చార్జి హార్బర్‌ ఏసీపీ శిరీష సందర్శించి కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తతం వారికి కేజీహెచ్‌లో (KGH) చికిత్స కొనసాగుతుందని తెలిపారు. 

బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. యవకుడు పెట్రోల్ ఎక్కడ కొనుగోలు చేశాడు.. వంటి వివరాలు సేకరిస్తున్నారు. అంతేకాకుండా కాలేజ్‌లో వారి మిత్రులతో మాట్లాడి సమాచారం సేకరించే పనిలో పడ్డారు. మరోవైపు హోటల్‌లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. 

మరోవైపు కూతురికి ఇలా జరిగిందని తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అల్లారుమద్దుగా పెంచుకున్న ఇలా చూసి తట్టుకోలేకపోతున్నారు. అయితే ఈ ఘటన తర్వాత యువతి హోటల్‌ గదిలో ఏం జరిగిందనే దానిపై తన తండ్రితో మాట్లాడుతూ వివరించినట్టుగా తెలుస్తోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

AP Food Commission Warning at NTR District | “మీ ఉద్యోగం పోతుంది చూసుకోండి” | Asianet News Telugu
IMD Rain Alert : శ్రీలంక సమీపంలో ఆవర్తనం... ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు