విశాఖపట్నంలో ఆదివారం ఉదయం స్వల్పంగా భూమి కంపించింది. నగరంలోని పలుచోట్ల భూమి కంపించడంతో ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగుతీసారు.
విశాఖపట్నం జిల్లాలో శనివారం రాత్రి పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది. ముఖ్యంగా విశాఖ నగరంలో ఈ భూకంప తీవ్రత కాస్త ఎక్కువగా వుండటంతో ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగుతీసారు. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టంగాని, ఆస్తినష్టం గానీ జరగలేదు.
visakhapatnam లోని పాత డెయిరీ ఫారం, బాలయ్య శాస్త్రి లేఔట్,అసిల్‌మెట్ట, అక్కయ్యపాలెం, తాటిచెట్లపాలెం, సీతమ్మధార, అల్లిపురం, మధురానగర్, రైల్వే న్యూకాలనీ, బీచ్‌రోడ్, ఎన్‌ఏడీ జంక్షన్ తో పాటు కంచరపాలెం, సింహాచలం తదితర ప్రాంతాల్లో ఉదయం భూమి స్వల్పంగా కంపించినట్టు గుర్తించారు. దీంతో ఒక్కసారిగా నగరవాసులు, అపార్ట్మెంట్ వాసులకు ఆందోళనకు గురయ్యారు. ఎక్కడ ఏం జరిగిందో అంటూ ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు.
విశాఖలో గత ఏడురోజుల్లో రోజుల వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. తాజాగా విశాఖలోని గాజువాకకు ఈశాన్యంగా 9.2కి.మీ దూరంలో 3.6 తీవ్రతతో ఆదివారం ఉదయం 7.13 నిమిషాలకు ఓసారి భూకంపం సంభవించినట్లు తెలిపారు. అలాగే ఇదే గాజువాకకు ఈశాన్యంగా 7.6కి.మీ దూరంలో ఉదయం 7.27 భూమి కంపించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక వివరాలు తెలియాల్సి వుంది.
ఈ భూకంపం కారణంగా కొన్ని చోట్ల భవనాల పెచ్చులు ఊడిపోగా పగుళ్లు ఏర్పడ్డాయి. అయితే పెద్దగా నష్టం జరగలేదు. విశాఖలో భూ ప్రకంపనలపై భూగర్భ శాస్త్రవేత్తలు వివరాలు వెల్లడించాల్సి ఉంది.
read more ఇండోనేషియాలో భారీ భూకంపం: రిక్టర్ స్కేల్‌పై 6.1గా నమోదు
ఇదిలావుంటే ఇటీవల తెలంగాణలోనూ గోదావరి పరివాహక ప్రాంతంలో భూకంపం సంభవించింది. జగిత్యాల, మంచిర్యాల జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది. 4.3తీవ్రతతో భూకంపం సంభవించినా భూమి లోపల 77 కి.మీ లోతులో భూకంప కేంద్రం వున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో స్వల్పంగా భూమి కంపించిందని... దీంతో ఎలాంటి నష్టం వాటిల్లలేదు.
జగిత్యాల, రామగుండం, మంచిర్యాల జిల్లాలోని లక్సెట్టిపేటతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. జగిత్యాల,, మంచిర్యాల జిల్లాలోని బెజ్జూరు, సలుగుపల్లి, సులుగుపల్లి గ్రామాల్లో స్వల్పంగా Earth quake సంబవించింది. వారం రోజుల వ్యవధిలో mancherial జిల్లాలో రెండు దఫాలు భూకంపం సంబవించడం కలకలం రేపుతుంది. ఈ నెల 24వ తేదీన పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో భూకంపం వాటిల్లింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇటవల కాలంలో స్వల్ప భూకంపాలు తరచుగా సంభవిస్తున్నాయి. ఈ ఏడాది ఆగష్టు 24న ఏపీ రాష్ట్రంలోని పలు చోట్ల భూకంపం వచ్చింది. బంగాశాఖాతంలో భూకంపం కారణంగా ఏపీ రాష్ట్రంలోని పలు చోట్ల భూమి కంపించింది.
read more Earthquake in Manali : మనాలీలో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.3గా నమోదు
దీపావళి పండుగ రోజున దేశంలో వరుస భూకంపాలు సంభవించాయి. ఈశాన్య రాష్ట్రాలు అసోం, మణిపూర్ సహా హిమాచల్ ప్రదేశ్‌లో ఈ రోజు భూమి కంపించింది. ఈ ప్రకంపనలకు ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
ఉత్తరాది రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్‌లో దీపావళి రోజున రెండుసార్లు కంపించింది. ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 2.5గా నమోదైంది. మరోసారి ఉదయం 7.15 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 2.4గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ(ఎన్‌సీఎస్) పేర్కొంది.