జగన్ ఆరా తీశారు: నలుగురి ఆత్మహత్యపై హోం మంత్రి సుచరిత

By narsimha lodeFirst Published Nov 9, 2020, 5:52 PM IST
Highlights

 పోలీసులు ఏ సందర్భంలోనైనా అత్యుత్సాహానికి పాల్పడితే చర్యలు తప్పవని ఏపీ రాష్ట్ర హోంశాఖ మంత్రి సుచరిత హెచ్చరించారు. 

అమరావతి: పోలీసులు ఏ సందర్భంలోనైనా అత్యుత్సాహానికి పాల్పడితే చర్యలు తప్పవని ఏపీ రాష్ట్ర హోంశాఖ మంత్రి సుచరిత హెచ్చరించారు. సోమవారం నాడు ఏపీ రాష్ట్ర హోంశాఖ మంత్రి సుచరిత అమరావతిలో మీడియాతో మాట్లాడారు.చీరాల, సీతానగరం ఘటనలే నిదర్శనంగా ఆమె చెప్పారు. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యపై సీఎం వెంటనే స్పందించారని ఆమె చెప్పారు. జగన్ వివరాలు అడిగి తెలుసుకున్నట్లు ఆమె తెలిపారు.

also read:అబ్ధుల్ సలాం ఆత్మహత్య కేసు: నంద్యాల పీఎస్ వద్ద ఉద్రిక్తత

ఇప్పటికే ఇద్దరు ఐపీఎస్ అధికారులతో విచారణ జరిపించినట్టుగా మంత్రి తెలిపారు. నంద్యాల సీఐ, కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. బాధిత కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారాన్ని ప్రకటించినట్టుగా మంత్రి తెలిపారు. 

కర్నూల్ జిల్లా నంద్యాల ఘటనపై సీఎం వివరాలు అడిగి తెలుసుకొన్నారని ఆమె చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఆదేశించానన్నారు.నంద్యాలలో ఆటోడ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు సంబంధించిన కేసులో మూడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు.

also read:ఆటో డ్రైవర్ సలాం కుటుంబం ఆత్మహత్య: నంద్యాల సీఐ, కానిస్టేబుల్ అరెస్ట్

ఎవరైనా వేధింపులకు గురైతే ఫిర్యాదులు చేయడానికి టోల్‌ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.ఇలాంటి ఘటనలపై రాజకీయ ఒత్తిళ్లు అసలే లేవని హోంమంత్రి స్పష్టం చేశారు. 

సలాం కుటుంబం ఆత్మహత్య  చేసుకోవడానికి  వెనుక కారణాలపై కూడ విచారణ చేస్తున్నామని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ చెప్పారు. ఈ కేసులో  అరెస్టైన సీఐ సోమశేఖర్ రెడ్డి, కానిస్టేబుల్ గంగాధర్ లకు బెయిల్ మంజూరైన విషయాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు. బెయిల్ విషయం కోర్టు పరిధిలోని అంశంగా ఆయన చెప్పారు.

పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రజలతో సామరస్యపూర్వకంగా అధికారులు ప్రవర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని  ఆయన చెప్పారు.


 

click me!