వచ్చే ఎన్నికల్లోగా పోలవరం పూర్తి.. తేల్చేసిన జగన్..

By AN TeluguFirst Published Nov 9, 2020, 2:58 PM IST
Highlights

పోలవరం విషయంలో జగర్ నోరెత్తడం లేదన్న ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెడుతూ మళ్లీ ఎన్నికలు జరిగేలోపే ప్రాజెక్టును పూర్తి చేస్తామని జగన్ స్పష్టం చేశారు. సోమశిల ప్రాజెక్ట్‌ రెండో దశ పనులకు వర్చువల్‌ విధానంలో సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి ఇవాళ శంకుస్థాపన చేశారు. 

పోలవరం విషయంలో జగర్ నోరెత్తడం లేదన్న ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెడుతూ మళ్లీ ఎన్నికలు జరిగేలోపే ప్రాజెక్టును పూర్తి చేస్తామని జగన్ స్పష్టం చేశారు. సోమశిల ప్రాజెక్ట్‌ రెండో దశ పనులకు వర్చువల్‌ విధానంలో సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి ఇవాళ శంకుస్థాపన చేశారు. 

సోమశిల హైలెవల్ లిఫ్ట్‌కెనాల్ రెండో దశతో 46,453 ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ శంకుస్థాపన కార్యక్రమం అనంతరం జగన్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలోపే పోలవరం పూర్తిచేస్తామని, నెల్లూరు బ్యారేజ్‌ను జనవరిలో ప్రజలకు అంకితం చేస్తామని తెలిపారు. 

సోమశిల-కండలేరు కాలువ సామర్థ్యాన్ని పెంచుతామని.. 2020-21లో ఆరు ప్రాధాన్యత ప్రాజెక్టులు పూర్తి చేస్తామని జగన్ చెప్పారు. మూడు ప్రాంతాల్లో ప్రాజెక్టులు చేపడతామని.. త్వరలో చాబోలు రిజర్వాయర్‌కు టెండర్లు పిలుస్తామని సీఎం జగన్ చెప్పుకొచ్చారు.

‘వ్యవసాయం, నీటి విలువ తెలిసిన ప్రభుత్వం మాది. పెన్నా నది నీటిని సద్వినియోగం చేసుకుంటూ మరిన్ని ప్రాంతాలకు సాగు, తాగు నీటిని అందించే సోమశిల రెండో దశ పనులు ప్రారంభించాం. ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లోని మెట్ట ప్రాంతాలకు సాగు, తాగునీరు.. ఆత్మకూరులో 10,103.. ఉదయగిరిలో 36,350 ఎకరాలకు సాగునీరు అందుతుంది. 

రూ. 527 కోట్లతో సోమశిలను ఎన్నికల ముందు హడావుడిగా నిర్మించాలని గత ప్రభుత్వం ఆరాటపడింది కానీ ఎలాంటి పనులు చేయలేదు. అవినీతి లేకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాం. సోమశిల హైలెవల్ ప్రాజెక్ట్‌లో రివర్స్ టెండరింగ్‌ ద్వారా 68 కోట్ల రూపాయలు ఆదా చేసి గత ప్రభుత్వం అవినీతికి చెక్ పెట్టాం. యుద్ధప్రాతిపదికన సోమశిల ప్రాజెక్ట్ పనులు పూర్తి చేస్తాం. 

వంశధార ఫేజ్-01, వంశధార-నాగావళి అనుసంధానం, వెలిగొండ ఫేజ్-01, అవుకు టన్నెల్-02, సంగం, నెల్లూరు బ్యారేజీలను వచ్చే జనవరిలోగా పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తాం. కండలేరు కాలువ, సోమశిల ఉత్తర కాలువ డబ్లింగ్ పనులు ప్రారంభిస్తాం’ అని జగన్ స్పష్టం చేశారు.

click me!