మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది.467 సెక్షన్ వర్తించదని హైకోర్టు తేల్చిచెప్పింది.41 సీఆర్‌పీసీ సెక్షన్ కింద నోటీసులిచ్చి విచారించాలని ఆదేశించింది.
అమరావతి: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది.మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై నమోదు చేసిన 467 సెక్షన్ వర్తించదని హైకోర్టు తెలిపింది. సీఆర్‌పీసీ 41 ఏసెక్షన్ కింద నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని హైకోర్టు బుధవారంనాడు ఆదేశించింది.అంతేకాదు సీఐడీ విచారణకు అయ్యన్నపాత్రుడు సహకరించాలని కూడ హైకోర్టు సూచించింది.మరోవైపు ఈ కేసును విచారించుకోవచ్చని సీఐడీకి తెలిపిందినీటిపారుదలశాఖ అధికారులు ఇచ్చిన ఎన్ఓసీ సర్టిపికెట్ విలువైన పత్రాల కిందకు రాదని హైకోర్టు స్పష్టం చేసింది.అయితే జలవనరులశాఖ ఇచ్చిన ఎన్ఓసీ విలువైన పత్రాల కిందకు వస్తుందని ప్రభుత్వం వాదించింది.సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ను దృష్టిలో ఉంచుకొని వ్యవహరించాలని సీఐడీకి హైకోర్టు సూచించింది.
విశాఖపట్టణంలో రెండు సెంట్ల భూమి ఆక్రమణకు సంబంధించి నకిలీ ఎన్ఓసీ సృష్టించారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడితో పాటు ఆయన ఇద్దరు కొడుకులు విజయ్,రాజేష్ లపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అయ్యన్నపాత్రుడి రిమాండ్ ను విశాఖపట్టణం కోర్టు తిరస్కరించడాన్ని ఏపీ హైకోర్టులో ప్రభుత్వంబ ఈ నెల 4వ తేదీన సవాల్ చేసింది.అరెస్ట్ సమయంలో అయ్యన్నపాత్రుడిపై నమోదుచేసిన 467 సెక్షన్ కూడా వర్తించదన విశాఖపట్టణం తేల్చింది. ఇదే అభిప్రాయాన్ని ఏపీ హైకోర్టు వ్యక్తంచేసింది.సీఆర్‌పీసీ 41ఏసెక్షన్ కింద నోటీసులు ఇచ్చి విచారించాలని హైకోర్టు సీఐడీని ఆదేశించింది.
undefined
also read:అయ్యన్నకు రిమాండ్ తిరస్కరణఫై హైకోర్టులో సవాల్: కౌంటర్ దాఖలుకి ప్రతివాదులకి ఆదేశం
నిబంధనలకు విరుద్దంగా కాలువపై ఇంటి ప్రహారీగోడను నిర్మించారని అయ్యన్నపాత్రుడిపై ఆరోపణలున్నాయి. ఈ విషయమై అయ్యన్న పాత్రుడి ఇంటి ప్రహారీగోడను కూల్చివేశారు.అయితే ఈ విషయమై ఎన్ఓసీ ని అయ్యన్నపాత్రుడి కటుంబ సభ్యులు చూపారు.దీంతో ప్రహారీగోడ కూల్చివేతను నిలిపివేశారు.అయితే ఈ విషయంలో ఫోర్జరీ ఎన్ఓసీని తీసుకువచ్చారని పోలీసులు అయ్యన్నపాత్రుడితో పాటు ఆయన ఇద్దరి కొడుకులపై కేసులు నమోదు చేశారు.