తిరుపతిలో ఐదుగురు టెన్త్ విద్యార్థుల మిస్సింగ్.. ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు..

Published : Nov 09, 2022, 01:02 PM IST
తిరుపతిలో ఐదుగురు టెన్త్ విద్యార్థుల మిస్సింగ్.. ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు..

సారాంశం

తిరుపతిలో టెన్త్ క్లాసు చదవుతున్న ఐదుగురు విద్యార్థులు కనిపించకుండాపోయారు. ఉదయం స్టడీ అవర్‌కు అని ఇంటి నుంచి వెళ్లిన విద్యార్థులు ఇంటికి తిరిగి రాలేదు.

తిరుపతిలో టెన్త్ క్లాసు చదవుతున్న ఐదుగురు విద్యార్థులు కనిపించకుండాపోయారు. బుధవారం ఉదయం స్టడీ అవర్‌కు అని ఇంటి నుంచి వెళ్లిన విద్యార్థులు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు.. పలుచోట్ల విద్యార్థుల కోసం గాలింపు చేపట్టారు. అయినప్పటికీ లాభం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. వారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. మూడు బృందాలను రంగంలోకి దించారు. వారి సెల్‌ఫోన్ సిగ్నల్స్, ఇతర సాంకేతిక ఆధారాల ద్వారా గాలింపు కొనసాగిస్తున్నారు. 

కనిపించకుండా పోయిన విద్యార్థుల్లో నెహ్రు నగర్‌కు చెందిన ముగ్గరు బాలికలతో పాటు.. మరో ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. అయితే స్టడీ అవర్స్‌కు అని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన విద్యార్థులు.. స్కూల్‌‌కు కూడా వెళ్లలేదని తెలుస్తోంది.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Holidays : జనవరి 2026 లో ఏకంగా 13 రోజులు సెలవులే.. అన్నీ లాంగ్ వీకెండ్స్..!
CM Chandrababu Naidu Speech | సెమీ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు నాయుడు | Asianet News Telugu