గన్నవరం అపెక్స్ కంపెనీలో పేలుడు:నలుగురికి గాయాలు

Published : Nov 09, 2022, 11:39 AM ISTUpdated : Nov 09, 2022, 12:05 PM IST
గన్నవరం అపెక్స్ కంపెనీలో పేలుడు:నలుగురికి గాయాలు

సారాంశం

గన్నవరంలోని అపెక్స్ కాస్టింగ్ కంపెనీలో పేలుడు చోటు చేసుకుంది.ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.  

గన్నవరం:ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గన్నవరంలో గల అపెక్స్  కంపెనీలో బుధవారంనాడు పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో  కంపెనీలో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.గ్యాస్ లీక్ కావడంతో పేలుడుచోటు చేసుకుందని సమాచారం.గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న అధికారులు కంపెనీలో రెస్క్యూఆపరేషన్స్ చేపట్టారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ఫ్యాక్టరీల్లో తరచుగా ప్రమాదాలు చోటు చేసుకంటున్నాయి.ప్రమాదాలు జరిగిన సమయంలో అధికారులు హడావుడి చేసి ఆ తర్వాత పట్టించుకోని కారణంగా ప్రమాదాలు పునరావృతం అవుతున్నాయని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.

హైద్రాబాద్ నగరంలోని బాలానగర్ లో ఈ ఏడాది సెప్టెంబర్ 6న కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో ఓ కార్మికుడు గాయపడ్డాడు. ఏపీలోని కాకినాడ జిల్లాలోని వాకలపూడి షుగర్ ఫ్యాక్టరీలో పేలుడులో ఇద్దరు కార్మికులు మృతి చెందారు.ఈ ఏడాది సెప్టెంబర్ 10న ఈ ఘటన జరిగింది..ఈ ఏడాది ఆగస్టు 19న కాకినాడ షుగర్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి  చెందారు.

PREV
click me!

Recommended Stories

Holidays : జనవరి 2026 లో ఏకంగా 13 రోజులు సెలవులే.. అన్నీ లాంగ్ వీకెండ్స్..!
CM Chandrababu Naidu Speech | సెమీ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు నాయుడు | Asianet News Telugu