
టీటీడీ బోర్డులో (ttd board) సభ్యులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం (ap govt) జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ బీజేపీ (bjp) నేత భానుప్రకాశ్‌రెడ్డి (Bhanu Prakash reddy) దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో (ap high court) విచారణ జరిగింది. ప్రస్తుతం బోర్డు నియమించిన 24 మంది సభ్యుల్లో 14 మందిపై నేరారోపణలు ఉన్నాయని వాదించారు. రాజకీయ నేపథ్యం ఉన్న నలుగురిని సభ్యులుగా నియమించారని పిటిషనర్ తరఫు న్యాయవాది అశ్విన్ కుమార్ వాదనలు వినిపించారు. 18 మంది సభ్యులను ఇంప్లీడ్ చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం 18 మంది సభ్యులకు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను దసరా సెలవుల తర్వాత చేపడతామని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
కాగా, సెప్టెంబర్ 15వ తేదీన జీవో 245 ద్వారా 25 మంది పాలకవర్గ సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. జీవో 568 ద్వారా 50 మంది ప్రత్యేక ఆహ్వానితులను నియమించారు. జీవో 569 ద్వారా ఇద్దరిని ఎక్స్ అఫిషియో సభ్యులుగా నియమించారు. ఈ జంబో కార్యవర్గంపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ విషయమై బీజేపీ నేతలు ఏపీ గవర్నర్‌కి (ap governor) కూడా ఫిర్యాదు చేశారు.
Also Read:జగన్‌కి హైకోర్టు షాక్: టీటీడీలో ప్రత్యేక ఆహ్వానితుల జీవో సస్పెన్షన్
అక్కడితో ఆగకుండా బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి, టీడీపీ నేత ఉమామహేశ్వరనాయుడు, హిందూ జనశక్తి సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు జి. లలిత్ కుమార్ లు టీటీడీలో జంబో పాలకవర్గం ఏర్పాటు చేయడాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. ఈ మూడు పిటిషన్లపై ఏపీ హైకోర్టు సెప్టెంబర్ 22న విచారణ నిర్వహించింది. అనంతరం ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు సస్పెండ్ చేసింది. అనంతరం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.