ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త 24 గంటల్లో46,558 మంది శాంపిల్స్ ను పరీక్షిస్తే 800 మందికి కరోనా నిర్ధారణ అయింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 09 మంది మృత్యువాతపడ్డారు.
అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ కొన్ని జిల్లాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది.గత 24 గంటల్లో46,558 మంది శాంపిల్స్ ను పరీక్షిస్తే 800 మందికి కరోనా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో కరోనా కేసులు 20,54,1663కి చేరుకొన్నాయి.నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 09 మంది మృత్యువాతపడ్డారు. దీంతో andhra pradesh రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14,228 కి చేరింది.
also read:ఇండియాలో కరోనా కేసుల తగ్గుముఖం:రెండో రోజూ 20 వేలకు దిగువనే కేసులు
గడిచిన 24 గంటల్లో 1178 మంది కరోనా నుంచి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు corona నుండి 20లక్షల 31వేల 681 మంది కోలుకొన్నారు. ఏపీలో ప్రస్తుతం 8,754 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
గత 24 గంటల్లో అనంతపురంలో012,చిత్తూరులో 120, తూర్పుగోదావరిలో126,గుంటూరులో111,కడపలో 027, కృష్ణాలో073, కర్నూల్ లో003 నెల్లూరులో084, ప్రకాశంలో 098,విశాఖపట్టణంలో 032,శ్రీకాకుళంలో002, విజయనగరంలో 008,పశ్చిమగోదావరిలో 104 కేసులు నమోదయ్యాయి.
గత 24 గంటల్లో కరోనాతో తొమ్మిది మంది చనిపోయారు.దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,228కి చేరుకొంది.
ఏపీలో పలు జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు
అనంతపురం-1,57,641, మరణాలు 1092
చిత్తూరు-2,44,702, మరణాలు1923
తూర్పుగోదావరి-2,92,018, మరణాలు 1285
గుంటూరు -1,76,503,మరణాలు 1222
కడప -1,15,142, మరణాలు 640
కృష్ణా -1,17,852,మరణాలు 1391
కర్నూల్ - 1,24,034,మరణాలు 852
నెల్లూరు -1,45,457,మరణాలు 1043
ప్రకాశం -1,37,749, మరణాలు 1099
శ్రీకాకుళం-1,22,763, మరణాలు 785
విశాఖపట్టణం -1,56,861, మరణాలు 1120
విజయనగరం -82,815, మరణాలు 670
పశ్చిమగోదావరి-1,78,231, మరణాలు 1106