ఏపీఎస్ఆర్టీసీ: దసరా బస్సుల్లో స్పెషల్ బాదుడు.. 50 శాతం అదనపు ఛార్జీలు, 8వ తేదీ నుంచి అమలు

Siva Kodati |  
Published : Oct 06, 2021, 05:33 PM IST
ఏపీఎస్ఆర్టీసీ: దసరా బస్సుల్లో స్పెషల్ బాదుడు.. 50 శాతం అదనపు ఛార్జీలు, 8వ తేదీ నుంచి అమలు

సారాంశం

దసరా (dasara) వచ్చిందంటే చాలు ప్రయాణీకుల జేబులు గుళ్ల చేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ (apsrtc) సిద్ధమవుతుంది. ప్రతి యేడు లాగానే ఈ సంవత్సరం కూడా స్పెషల్ బస్సుల పేరుతో స్పెషల్ ఛార్జీలు వసులు చేసుందుకు సంస్థ రెడీ అవుతోంది

దసరా (dasara) వచ్చిందంటే చాలు ప్రయాణీకుల జేబులు గుళ్ల చేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ (apsrtc) సిద్ధమవుతుంది. ప్రతి యేడు లాగానే ఈ సంవత్సరం కూడా స్పెషల్ బస్సుల పేరుతో స్పెషల్ ఛార్జీలు వసులు చేసుందుకు సంస్థ రెడీ అవుతోంది. దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు.

అయితే స్పెషల్ బస్సుల్లో స్పెషల్ ఛార్జీలు (special charges) వసూలు చేస్తున్నట్లుగా వెల్లడించారు. ఓ వైపు బస్సు ఖాళీగా వెళ్తుందని.. కాబట్టి స్పెషల్ బస్సుల్లో 50 శాతం పెంచుతున్నామని  తెలిపారు. రెగ్యులర్ సర్వీసులు యథావిధిగా నడుస్తాయని..  వాటిలో సాధారణ ఛార్జ్ లే ఉంటాయన్నారు. దసరా సందర్భంగా 4 వేల ప్రత్యేక సర్వీసులు నడపాలని నిర్ణయం తీసుకున్నట్లుగా ద్వారకా తిరుమల రావు (dwaraka tirumalarao) వెల్లడించారు. ఈ నెల 8వ తేదీ నుంచే 18 వ తేదీ వరకు స్పెషల్ బస్సులు నడుస్తాయన్నారు.

ALso Read:ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్: ఏమిటో తెలుసా?

ఆన్‌లైన్‌లో రెగ్యులర్ సర్వీస్‌ల టిక్కెట్లు ఇంకా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రజలను దోచుకోవాలని ఆర్టీసీ భావించదని.. మనుగడ కోసమే చార్జీల పెంపు అని వివరణ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వంతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నానని ద్వారకా తిరుమల రావు పేర్కొన్నారు. కారుణ్య నియామకాలు, ఇతర బెనిఫిట్స్‌పై ప్రభుత్వం సానుకూలంగా ఉందని.. ఆర్ధిక ఇబ్బందులు అధిగమించడానికి కార్గో సేవలను విస్తృత పరిచామన్నారు. మరో 100 ఎలక్ట్రిక్ బస్సులు సమకూర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. పెరిగిన డీజిల్ రేట్లు సంస్థపై తీవ్ర భారం పడుతోందన్నారు. ఇప్పటి వరకు ప్రయాణికుల నుంచి పెద్దగా డిమాండ్ కనపడటంలేదని.. అయితే తాము మాత్రం ఏర్పాట్లు చేస్తున్నామని ఎండీ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు.
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్