సినిమా టికెట్ రేట్లపై.. జీఓ 35ను రద్దు సవాల్ పిటీషన్ విచారణ జనవరి 4కు వాయిదా..

By SumaBala Bukka  |  First Published Dec 23, 2021, 12:55 PM IST

ఏపి హై కోర్ట్ లో నేడు పలు కీలక కేసులు విచారణకు వచ్చాయి. అందులో ఒకటైన సినిమా టికెట్ల ధరల నియంత్రణ జీఓ 35 రద్దు ను సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్ విచారణ జరిగింది. ఈ విచారణను హైకోర్టు జనవరి 4కి వాయిదా వేసింది.  ఇప్పటికే జీఓ అమలుపై ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సింగిల్ బెంచ్ అదేశాలను ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది. 


అమరావతి : ఏపి హై కోర్ట్ లో నేడు పలు కీలక కేసులు విచారణకు వచ్చాయి. అందులో ఒకటైన సినిమా టికెట్ల ధరల నియంత్రణ జీఓ 35 రద్దు ను సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్ విచారణ జరిగింది. ఈ విచారణను హైకోర్టు జనవరి 4కి వాయిదా వేసింది.  ఇప్పటికే జీఓ అమలుపై ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సింగిల్ బెంచ్ అదేశాలను ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది. 

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో పలు కీలక కేసులు హై కోర్టులో విచారణకు రానున్నాయి. వాటిల్లో మహిళ సంరక్షణ కార్యదర్శలను  మహిళ పోలీస్ గా మారుస్తూ ప్రభుత్వం తెచ్చిన జీఓ 59 పై వేసిన పిటిషన్ లు విచారణ, సినిమా టికెట్ల ధరల విషయంలో  ప్రభుత్వం వేసిన అప్పీల్, థియేటర్ యాజమాన్యాలు  లు వేసిన రిట్ పిటిషన్ల పై విచారణ, అనంత పురం జిల్లా ఒబులేశ్వరం గుడి కి చెందిన భూముల ను ఎస్సీ కార్పొరేషన్ కి కేటాయింపు అంశం...ప్రభుత్వ వేసిన అప్పీల్ పై విచారణ జరగనున్నాయి. 

Latest Videos

కాగా, సినిమా టికెట్ల ధరల నియంత్రణ జీఓ 35 రద్దు ను సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్ విచారణ జనవరి 4కి వాయిదా పడింది.

ఇదిలా ఉండగా, విజయవాడలో గురువారం జరగాల్సిన exhibitors association meeting వాయిదా పడింది. రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లలో పోలీసులు, అధికారుల తనిఖీల కారణంగా సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ బుధవారం తెలిపింది. అలాగే గురువారం హైకోర్టులో (ap high court) జీవో నెం 35 రద్దుపై (go no 35) విచారణకు రానుండడంతో అసోసియేషన్ పునరాలోచనలో పడింది. ఈ  విచారణ తరువాత శుక్రవారం మీటింగ్ పెట్టాలని ముందుగా నిర్ణయించారు. ఇప్పుడు ఈ విచారణ జనవరి 4కు వాయిదా పడడంతో సమావేశం మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే. 

ఏపీ : ఆన్‌లైన్ మూవీ టికెట్లపై జీవో విడుదల..పేటీఎం, బుక్ మై షోలకు ఇక చెక్

మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయంటూ.. విజయనగరం జిల్లాలో ఆరు సినిమా థియేటర్లను అధికారులు సీజ్ చేసిన సంఘటన ఇప్పుడు ఏపీలో సెన్సేషన్‌గా మారింది. నిబంధ‌న‌ల‌ను పాటించ‌డం లేదంటూ.. సినిమా థియేట‌ర్లపై జాయింట్ క‌లెక్టర్ డాక్టర్ కిశోర్ కుమార్ కొర‌డా ఝుళిపించారు. ఆరు సినిమా హాళ్లను మూసివేయాల‌ని తాహశీల్దార్‌ను ఆదేశించారు.

వివరాల్లోకి వెళితే...విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగ‌, భోగాపురం, నెల్లిమర్ల మండ‌లాల్లో ఆక‌స్మికంగా ప‌ర్యటించి.. సినిమా థియేట‌ర్లను అధికారులు త‌నిఖీ చేశారు. పూస‌పాటిరేగ సాయికృష్ణా థియేట‌ర్‌ను ఆఫీసర్లు ప‌రిశీలించారు. ఈ థియేట‌ర్‌లో ఫైర్ సేఫ్టీ లైసెన్స్ 2015 నుంచి రెన్యువ‌ల్ చేయ‌క‌పోవ‌డాన్ని గుర్తించి.. తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. థియేట‌ర్‌ను సీజ్ చేయాల‌ని తాహశీల్దార్‌ను జేసీ ఆదేశించారు.

ఇక భోగాపురంలోని గోపాల‌కృష్ణ థియేట‌ర్‌ను త‌నిఖీ చేసి.. సినిమా టిక్కెట్లను అధిక ధ‌ర‌ల‌కు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ థియేట‌ర్‌ను కూడా సీజ్ చేయాల‌ని జేసీ ఆదేశించారు. నెల్లిమర్లలోని ఎస్ త్రి సినిమాస్ థియేటర్‌లో కూడా.. టిక్కెట్లు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తేలడంతో.. హాలును అధికారులు సీజ్ చేశారు. విజయనగరం జిల్లాలోనే మొత్తం ఆరు థియేటర్లకు మూత వేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు ...మరిన్ని జిల్లాల్లో కూడా దాడులు జరగనున్నాయి. ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ గా సేప్టీ నార్మ్స్ విషయంలో ముందుకు వెళ్తోంది. ఇది థియోటర్ యజమానులకు పెద్ద సమస్యగా మారనుంది. 

click me!