విశాఖ తంతడి తీరానికి కొట్టుకొచ్చిన అతిపెద్ద వేల్ షార్క్..

By SumaBala Bukka  |  First Published Dec 23, 2021, 10:58 AM IST

ప్రపంచంలోనే అతిపెద్ద చేపగా గుర్తించబడిన వేల్ షార్క్ విశాఖ తీరానికి వచ్చింది. ఇక్కడి తంతడి బీచ్ లో బుధవారం స్థానిక మత్స్యకారుల వలకు చిక్కింది. 50 అడుగుల పొడవు, 2 టన్నుల బరువు ఉండే చేప ఒడ్డుకు రావడాన్ని గమనించిన వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ శ్రీకాంత్ మన్నెహరి వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారాన్ని అందించారు. 


ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలోని tantadi beachలో చేపల వేటలో వలలో చిక్కుకుని ఒడ్డుకు చేరుకున్న whale sharkను కొందరు స్థానిక fishermen రక్షించారని జిల్లా అటవీ అధికారి (డిఎఫ్‌ఓ) అనంత్ శంకర్ తెలిపారు.

అటవీ శాఖ అధికారులు, మత్స్యకారులు,  వన్యప్రాణుల సంరక్షకులు షార్క్‌ను తిరిగి సముద్రంలోకి పంపించారని DFO తెలిపారు. "ఇది వేల్ షార్క్, ప్రపంచంలోనే అతిపెద్ద చేప. ఇది అంతరించిపోతున్న జాతికి చెందినవని’’ చెప్పుకొచ్చారు.

Latest Videos

undefined

ప్రపంచంలోనే అతిపెద్ద చేపగా గుర్తించబడిన వేల్ షార్క్ విశాఖ తీరానికి వచ్చింది. ఇక్కడి తంతడి బీచ్ లో బుధవారం స్థానిక మత్స్యకారుల వలకు చిక్కింది. 50 అడుగుల పొడవు, 2 టన్నుల బరువు ఉండే చేప ఒడ్డుకు రావడాన్ని గమనించిన వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ శ్రీకాంత్ మన్నెహరి వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారాన్ని అందించారు. 

రామతీర్థంలో నిరసన: మాజీ కేంద్ర మంత్రి ఆశోక్‌గజపతిరాజుపై నెల్లిమర్లలో కేసు

విశాఖ డీఎఫ్ వో అనంత్ శంకర్ ఆదేశాల మేరకు సిబ్బంది వెంటనే తంతడి బీచ్ కు చేరుకుని ప్రపంచంలోనే అతిపెద్ద చేప అయిన వేల్ షార్క్ గా దీనిని నిర్థారించారు. అంతరించిపోతున్న షార్క్ల జాతిలో ఇదొకటిగా గుర్తించారు. షార్క్ ను సురక్షితంగా సముద్రంలోకి పించే ఏర్పాట్లు చేయాలని డీఎఫ్ వో అనంత్ శంకర్ సూచించారు. 

వెంటనే అటవీశాఖ సిబ్బంది, మత్స్యకారులు, వన్యప్రాణుల సంరక్షకులు షార్క్ కు ఫిల్టర్ ఫీడింగ్ ఇచ్చారు. ఆ తరువాత షార్క్ ను సురక్షితంగా సముద్రంలోకి పంపించారు. దీంతో ’ఈ 2-టన్నుల చేప సజీవంగా సముద్రంలోకి తిరిగి వెళ్లింది. మా ప్రయత్నాలు విజయవంతం అయ్యాయి. వేల్ షార్క్ విజయవంతంగా సముద్రపు లోతుల్లోకి వెళ్లింది. స్వేచ్ఛగా ఈదుతోంది’ అని ఆయన చెప్పారు.

"ఈ షార్క్ ఫొటోలు తరువాతి కాంలో గుర్తింపు కోసం మాల్దీవుల వేల్ షార్క్ పరిశోధన కార్యక్రమంలో భాగస్వామ్యం చేయబడుతున్నాయి. ఈ సున్నితమైన ప్రాణుల కదలికలతో భూభాగాలను బాగా అర్థం చేసుకోవడానికి ఇది మాకు సహాయపడుతుంది," అని చెప్పారు.

గుంటూరు: కృష్ణా నదిలో చిక్కిన వింత చేప

"మత్స్యకారులకు కూడా సలహాలు ఇస్తున్నాం. షార్క్ లు లాంటి జీవాలు తీరాలకు కొట్టుకొచ్చిన సందర్భాల్లో నేరుగా రక్షించి, సురక్షితంగా విడుదల చేయడానికి అటవీ శాఖను సంప్రదించమని కోరుతున్నాం.  అటువంటి ఆపరేషన్ల సమయంలో మత్స్యకారులకు వారి చేపల వేట వలలకు ఏదైనా నష్టం జరిగితే పరిహారం ఇవ్వబడుతుంది. వేల్ షార్క్‌లు చేపలు పట్టే వలల్లో చిక్కుకున్నట్లయితే వేల్ షార్క్‌లను విడుదల చేయాలి" అన్నారాయన.

కాగా, విశాఖలో మత్స్యకారుల వలకు భారీ టేకు చేప చిక్కింది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామ సమీపంలోని కృష్ణా నదిలో బుధవారం చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు పోస సాయికృష్ణ, ఉట్టి వెంకటేశ్వర్లు, గంగరాజులు వేసిన వలలో 200 కిలోల బరువున్న భారీ టేకు చేప పడింది. 

click me!