పీఆర్సీపై పీటముడి: సీఎంతోనే తేల్చుకొంటామంటున్న ఏపీ ఉద్యోగ సంఘాలు

By narsimha lode  |  First Published Dec 23, 2021, 10:21 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీఆర్సీ విషయమై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. సీఎస్ నేతృత్వంలోని కమిటీతో ఉద్యోగ సంఘాల నేతల చర్చలు అసంతృప్తిగానే మిగిలాయి.  వచ్చే వారంలో జరిగే సీఎంతో సమావేశం ఏర్పాటు చేయిస్తానని సీఎస్ హామీ ఇచ్చారు. సీఎంతో జరిగే సమావేశంలో పీఆర్సీపై తేల్చుకొంటామని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.
 


అమరావతి: ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల Prc విషయమై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. AP Employees union డిమాండ్ విషయమైChief Secretary  నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీ నుండి సానుకూలత కన్పించలేదు. దీంతో  సీఎం జగన్ తోనే పీఆర్సీ పై తేల్చుకొంటామని ఉద్యోగ సంఘాలు తేల్చి చెప్పారు.ఈ నెల 22న సీఎస్ నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీతో ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యారు. అయితే ఈ సమావేశంలో  అధికారుల తీరుపై ఉద్యోగ సంఘాల నేతలు అసంతృప్తిని వ్యక్తం చేశారు.  ఇక సీఎం  Ys jagan తో జరిగే సమావేశంలోనే తేల్చుకొంటామని ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు.ఇక నేను చెప్పేదేం లేదు. చెప్పాల్సింది ముందే చెప్పేశాం.. ఏదైనా ఉంటే మీరే చెప్పండి... నా మాట అదే’ అంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ.. ఈ  సమావేశంలో ఉద్యోగ సంఘ నాయకులకు తేల్చిచెప్పారు.  దీంతో ఉద్యోగ సంఘాల నేతలు సీఎంతో జరిగే సమావేశంలోనే పీఆర్సీపై నిర్ణయం తీసుకొంటామని ప్రకటించారు.

also read:పీఆర్సీపై ఏపీ సర్కార్ కసరత్తు: కార్యదర్శుల కమిటీ భేటీ, ఉద్యోగ సంఘాల డిమాండ్లపై చర్చ

Latest Videos


27 శాతం నుంచి 31 శాతం వరకు పీఆర్సీ అమలు చేస్తే ప్రతి నెలా ఎంత ఖర్చు అవుతుంది? సీఎస్‌ కమిటీ ఖరారు చేసిన 14.29 శాతం ఫిట్‌మెంట్‌ అమలు చేస్తే ఏఎస్‌వో, ఎస్‌వో, డిప్యూటీ తహసిల్దార్‌, సబ్‌ట్రెజరీ ఆఫీసర్‌, డిప్యూటీ ఎగ్జ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌కి సంబంధించిన వేతనాలు ఎంతెంత తగ్గుతాయనేది ఏకరువు పెట్టారు. తాము తెచ్చిన గణాంకాల్లో రూపాయి తేడా ఉన్నా వదిలేసి వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నామని సీఎస్‌కి చెప్పారు. సీఎస్‌ కమిటీ నివేదికలో ఉన్న సిఫారసులు కాకుండా ఇంకేమైనా చెప్తారా ? ఎన్ని రోజులు మాట్లాడుకుంటాం ? మీరు చెప్పలేకపోతే మమ్మల్ని సీఎం దగ్గరకు తీసుకెళ్లండని సీఎస్ ను ఉద్యోగ సంఘాలనాయకులు అడిగారు. 

సీఎస్ నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీ సిఫారసు చేసిన 14.29 ఫిట్ మెంట్ కు అంగీకరించేది లేదని ఉద్యోగ సంఘాలు ఈ సమావేశంలో తేల్చి చెప్పాయి. సీఎం వద్దే ఈ విషయాన్ని తేల్చుకొంటామని ఉద్యోగ సంఘాలు సీఎస్ కమిటీకి తేల్చి చెప్పారు. ఉద్యోగసంఘాల నాయకులను సీఎం దగ్గరకు తీసుకెళ్తానని  సీఎస్  Sameer Sharma హామీ ఇచ్చారు. వచ్చే వారం తీసుకెళ్తానని సీఎస్‌ చెప్పారు. ఉద్యోగులకు సంబంధించి ఇవ్వాల్సిన వివిధ రకాల పెండింగ్‌ నిధులన్నీ ఒక్కసారిగాకాకుండా కొద్దికొద్దిగా మార్చి నాటికి ఇస్తామని సీఎస్‌ సమీర్‌ శర్మ ఉద్యోగసంఘాల నాయకులకు చెప్పారు. ఉద్యోగులకు సంబంధించి లోను అడ్వాన్సులు, ఎల్టీసీ, మెడికల్‌ బిల్లులు, జీపీఎఫ్‌, రిటైర్‌మెంట్‌ ప్రయోజనాలు కలిసి ప్రభుత్వం వద్ద రూ.1600 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని సీఎస్‌ చెప్పారు. అయితే ఇవి రూ.2,200 కోట్లు ఉన్నాయని ఉద్యోగులు వాదిస్తున్నారు.

వచ్చేవారం పీఆర్సీపై సీఎంకు అన్ని వివరాలు చెప్పి త్వరలో సీఎంతో సమావేశం ఏర్పాటు చేస్తామని సీఎస్‌ చెప్పారని ఏపీ  జేఏసీ చైర్మన్‌  Bandi Srinivasa Rao  తెలిపారు. ‘అధికారుల కమిటీ సిఫారసులను అంగీకరించేదిలేదని సీఎస్‌కు స్పష్టం చేశాం. సమావేశంలో ఉద్యోగులకు సంబంధించిన 71 డిమాండ్లపై చర్చించాం. ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.1600 కోట్ల విలువైన జీపీఎప్‌, ఏపీజీఎల్‌ఐ, మెడికల్‌ బిల్లులు, రిటైర్డ్‌ ఎంప్లాయిస్‌ బెనిఫిట్స్‌ త్వరలోనే చెల్లిస్తామని అధికారులు చెప్పారు. జాయింట్‌స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశాలతో కాలయాపన తప్ప ఉపయోగంలేదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ Bopparaju Venkateshwarlu  అన్నారు. ‘‘గతంలో జరిగిన సమావేశాల్లో ఉద్యోగ సంఘాలుగా మా అభిప్రాయాలు తెలిపాం. సీఎం ఏం చెప్పారో, ప్రభుత్వం అభిప్రాయం ఏంటో ఇప్పటికీ మాకు చెప్పడం లేదన్నారు.అధికారుల కమిటీ సీఎం జగన్‌ను తప్పుదోవ పట్టిస్తున్నదని సచివాలయ ఉద్యగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. ‘‘పీఆర్సీపై అధికారుల కమిటీ ఇచ్చిన నివేదిక అన్యాయంగా ఉంది. 14.29 శాతం ఫిట్‌మెంట్‌ వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదన్నారు.


 

click me!