AP PRC : ప్రభుత్వంతో చర్చలు సఫలం.. సమ్మె తాత్కాలిక విరమణ: ఉద్యోగ సంఘాలు

Siva Kodati |  
Published : Dec 16, 2021, 11:24 PM IST
AP PRC : ప్రభుత్వంతో చర్చలు సఫలం.. సమ్మె తాత్కాలిక విరమణ: ఉద్యోగ సంఘాలు

సారాంశం

పీఆర్సీ సహా (ap prc report) ఇతర డిమాండ్లు పరిష్కరించాలంటూ గత కొన్ని రోజులుగా ఉద్యోగ సంఘాలు (ap employees) నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఉద్యమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి ఉద్యోగ సంఘాలు.

పీఆర్సీ సహా (ap prc report) ఇతర డిమాండ్లు పరిష్కరించాలంటూ గత కొన్ని రోజులుగా ఉద్యోగ సంఘాలు (ap employees) నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఉద్యమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి ఉద్యోగ సంఘాలు. తమ డిమాండ్లపై మంత్రి బుగ్గన, సీఎస్‌తో చర్చించామని ఏపీ జేఏసీ ఛైర్మన్ (ap jac chairman) బండి శ్రీనివాసరావు (bandi srinivasa rao) తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన అన్నారు. తాము పెట్టిన 71 డిమాండ్లపై మంత్రి బుగ్గన, సీఎస్ సమీర్ శర్మతో చర్చించామన్నారు. 

త్వరలోనే ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (buggana rajendra reddy) వెల్లడించారు. పెండింగ్‌లో వున్న సమస్యలపై ఉద్యోగ సంఘాలతో చర్చించామని మంత్రి తెలిపారు. ఉద్యోగ సమస్యలపై సమావేశాలు పెట్టి పరిష్కరిస్తామని బుగ్గన హామీ ఇచ్చారు. ఆందోళన విరమించాలని ఉద్యోగ సంఘాలను కోరామని మంత్రి తెలిపారు. కరోనా కారణంగా పరిపాలన పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని మంత్రి బుగ్గన వెల్లడించారు. 

Also Read:AP Employees PRC: 34 శాతం ఫిట్‌మెంట్ సాధ్యం కాదు.. సీఎం తో భేటీ తర్వాత సజ్జల కీలక వ్యాఖ్యలు

తమ ప్రభుత్వం ప్రతి ఒక్కరినీ ఫ్యామ్లీ మెంబరుగా భావిస్తోందని.. టైమ్ బౌండ్ పెట్టుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. ఉద్యోగులు లేవనెత్తిన ప్రతి సమస్యనూ పరిష్కరించేందుకు సానుకూలంగా ఉందని.. ఉద్యోగుల సమస్యలపై వివిధ శాఖల అధికారులతో సీఎస్ బుధవారం సమావేశం అవుతారని బుగ్గన తెలిపారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కంటిన్యూగా టచ్లో ఉంటామని.. ఉద్యమంలో ఉన్న తొమ్మిది సంఘాలను ఆందోళన విరమించాలని కోరామని ఆర్ధిక మంత్రి వెల్లడించారు. 
 
ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. దురుద్దేశ్యంతో ఉద్యమానికి వెళ్లలేదని, సమస్యల పరిష్కారం కోసమే ఉద్యమించామని తెలిపారు. ఆర్ధికేతర సమస్యలు కూడా చాలా కాలం పెండింగులో ఉన్నాయని.. తమ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారని బొప్పరాజు వెల్లడించారు. బుధవారం స్వయంగా సీఎస్ సమీర్ శర్మ సమీక్షించనున్నారని.. ప్రభుత్వ సానుకూల స్పందనతో తాత్కాలికంగా ఉద్యమాన్ని వాయిదా వేస్తున్నామని వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్