ఒకే వేదిక‌పైకి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌, సీఎం జ‌గ‌న్‌.. నాడు ఫిర్యాదు, నేడు తేనీటి విందు..

Published : Dec 25, 2021, 10:28 AM IST
ఒకే వేదిక‌పైకి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌, సీఎం జ‌గ‌న్‌.. నాడు ఫిర్యాదు, నేడు తేనీటి విందు..

సారాంశం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌యాల్లో జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ జోక్యం చేసుకుంటున్నార‌ని, అలాగే ఇత‌రేత‌ర‌ అంశాల‌ను ఫిర్యాదులో పేర్కొన్న సంగ‌తి తెలిసిందే. జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌ను ప్ర‌త్య‌ర్థి వ‌ర్గంలో వైసీపీ జ‌మ క‌ట్టి, ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు కూడా చేస్తూ వుంటుంది. జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ చివ‌రికి స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా నియ‌మితుల‌య్యారు.   

ఒకే వేదిక‌పైకి ఇద్ద‌రు ప్ర‌ముఖులు రానున్నారు. సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి justice nv ramana, ముఖ్య‌మంత్రి YS Jagan ఒకే వేదిక మీద‌ క‌నిపించ‌నుండ‌డంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. దీనికి కారణం.. నాడు సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ, ఏపీ హైకోర్టు చీఫ్ జ‌స్టిస్‌, మ‌రో ముగ్గురు న్యాయ‌మూర్తుల‌పై సీఎం జ‌గ‌న్ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌యాల్లో జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ జోక్యం చేసుకుంటున్నార‌ని, అలాగే ఇత‌రేత‌ర‌ అంశాల‌ను ఫిర్యాదులో పేర్కొన్న సంగ‌తి తెలిసిందే. జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌ను ప్ర‌త్య‌ర్థి వ‌ర్గంలో వైసీపీ జ‌మ క‌ట్టి, ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు కూడా చేస్తూ వుంటుంది. జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ చివ‌రికి స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా నియ‌మితుల‌య్యారు. 

సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా నియమితులైన త‌ర్వాత ఆయ‌న మొద‌టిసారిగా కృష్ణా జిల్లాలోని త‌న స్వ‌గ్రామానికి వెళుతున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మూడు రోజుల పాటు ఉండ‌నున్నారు. ప‌లు పౌర స‌న్మానాలు అందుకోనున్నారు.

జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ గౌర‌వార్థం ఏపీ ప్ర‌భుత్వం తేనీటి విందును ఏర్పాటు చేసింది. ఈ నెల 25న విజ‌య‌వాడ ఇందిరాగాంధీ స్టేడియం లో సాయంత్రం 5 గంట‌ల‌కు ఏర్పాటు చేసిన తేనీటి విందులో జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పాల్గొన‌నుండ‌డం విశేషం. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు మంత్రులు, న్యాయ‌ మూర్తులు, న్యాయ‌వాదులు కూడా పాల్గొంటారు. జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌, జ‌గ‌న్ ప‌ర‌స్ప‌రం క‌లుసుకోవ‌డం ఆస‌క్తిక‌ర‌, శుభ‌ప‌రిణామంగా చెప్పొచ్చు.

ఇదిలా ఉండగా,  శుక్రవారం సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తన స్వగ్రామమైన కృష్ణాజిల్లా పొన్నవరంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సభలో పాల్గొని ప్రసంగించారు. పొన్నవరం, కంచికచర్ల లోనే తన ప్రాధమిక విద్య కొనసాగిందని జస్టిస్ ఎన్వీరమణ గుర్తుచేసుకున్నారు. 1960వ దశకంలోనే రాజకీయ చైతన్యం ఉన్న గ్రామం పొన్నవరం అని ఆయన ప్రశంసించారు. తెలుగు జాతి అంతా ఒక్కటిగా ఉండాలని .. కష్టపడే తత్వం ఉన్న తెలుగు వాళ్లు ప్రపంచ దేశాల్లోనూ పేరు ప్రఖ్యాతులు గడుస్తున్నారని ఎన్వీ రమణ కొనియాడారు. 

స్వగ్రామంలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ.. తెలుగువారంతా ఒక్కటిగా వుండాలని పిలుపు

తన చిన్ననాటి మిత్రులను కలవడం సంతోషంగా ఉందని..  ప్రజలంతా ఐక్యంగా ఉండి రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. అంతకుముందు సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా స్వగ్రామానికి వచ్చిన జస్టిస్ ఎన్వీ రమణకు స్థానికులు ఘన స్వాగతం పలికారు.. సీజే దంపతులను ఎడ్ల బండిపై ఊరేగింపుగా మేళతాళాలతో గ్రామంలోకి తీసుకెళ్లారు. పొన్నవరంలోని శివాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్థులు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మూడు రోజుల పాటూ ఏపీలో జస్టిస్ ఎన్వీ రమణ పర్యటించనున్నారు.

పొన్నవరంలో పర్యటన ముగించుకుని సీజేఐ మధ్యాహ్నం విజయవాడ చేరుకుంటారు. అక్కడి నుంచి గుంటూరు జిల్లా పెదనందిపాడులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు నివాసానికి వెళతారు. అనంతరం రాత్రికి విజయవాడ చేరుకుని నోవాటెల్‌లో బస చేస్తారు. శనివారం ఉదయం ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దర్శనం చేసుకుంటారు. సాయంత్రం 5 గంటలకు ఇందిరాగాంధీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తేనీటి విందుకు హాజరవుతారు. ఆ తర్వాత సిద్ధార్థ అకాడమీలో రోటరీ క్లబ్‌లో పౌర సన్మానం స్వీకరిస్తారు.. అనంతరం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చే విందుకు హాజరవుతారు.

ఆదివారం సీజేఐ విజయవాడలోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు అనంతరం గుంటూరులోని నాగార్జున విశ్వ విద్యాలయంలో జరిగే జ్యుడిషీయల్ ఆఫీసర్ల కాన్ఫరెన్సులో పాల్గొంటారు. మధ్యాహ్నం హైకోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్, స్టేట్ బార్ కౌన్సిల్‌లో ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. సాయంత్రం ఐదు గంటలకు గవర్నర్ ఇచ్చే తేనీటి విందుకు హాజరవుతారు. అనంతరం బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానం కార్యక్రమానికి వెళతారు. తర్వాత రాత్రికి విజయవాడ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరతారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం