మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకు ప్రభుత్వం సెక్యూరిటీని కల్పించింది. 2+2 సెక్యూరిటీని కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.రాధాను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించిన వారెవరేవరనే విషయమై ఆధారాలు సేకరించి రిపోర్టు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు.
అమరావతి: తనను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించారని సంచలన ఆరోపణలు చేసిన vangveeti Radhaకు రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీని కల్పించాలని నిర్ణయం తీసుకొంది. 2+2 సెక్యూరిటీని కల్పించాలని సీఎం Ys Jagan పోలీస్ అధికారులను ఆదేశించారు.
తన పై కుట్ర జరుగుతోందని, తనని చంపడానికి రెక్కి నిర్వహించారని రాధా ఆ దివారం నాడు గుడివాడలో ప్రకటించారు. అయితే దీనికి సంబంధించిన ఆధారాలు సేకరించి రిపోర్ట్ ఇవ్వాలని ఇంటిలిజెన్స్ డీజీపీ ని సీఎం జగన్ ఆదేశించారు.
undefined
also read:నా తమ్ముడు మేలిమి బంగారం.... పదవి తీసుకోకుండా టీడీపీలోకి : వంగవీటి రాధాపై కొడాలి నాని ప్రశంసలు
వంగవీటి రంగా 33 వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం నాడు రంగా విగ్రహన్ని ఆవిష్కరించిన అనంతరం వంగవీటి రాధా మాట్లాడారు. తనను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించారన్నారు. ఈ రెక్కీ ఎవరు చేశారోననే విషయం త్వరలోనే తేలుతుందన్నారు.తన హత్యకు కుట్రపన్నారని.. ఈ మేరకు రెక్కీ కూడా నిర్వహించారంటూ ఆయన ఆరోపణలు చేశారు. రెక్కీ నిర్వహించింది ఎవరో త్వరలో తెలుస్తుందని రాధా చెప్పారు.
అలాంటి వ్యక్తులను దూరం పెట్టాలని ఆయన అభిమానులకు పిలుపునిచ్చారు. రంగా ఆశయాల సాధనే తన లక్ష్యమన్నారు. పదవులపై తనకు ఎలాంటి ఆశ లేదని ఆయన తెలిపారు. తనను పొట్టన పెట్టుకోవాలని అనుకునేవారికి భయపడేది లేదని వంగవీటి రాధా స్పష్టం చేశారు. తాను ప్రజల మధ్యే వుంటానని, నన్ను లేకుండా చేయాలనుకునే వారిని ప్రజలు దూరం పెట్టాలని రాధా పిలుపునిచ్చారు.
తన సమక్షంలో నే వంగవీటి రాధా ఈ వ్యాఖ్యలు చేయడంతో ఈ విషయమై మంత్రి కొడాలి నాని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. రేపట్నుంచి వంగవీటి రాధాకు 2 ప్లస్ 2 గన్ మెన్స్ కేటాయించాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు.
వంగవీటి రాధా 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో Tdp అభ్యర్ధుల తరపున ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత ఏపీలో టీడీపీ అధికారాన్ని కోల్పోయింది. ycp అధికారంలోకి వచ్చింది. Kodali Nani, Vallabhaneni Vamsi, వంగవీటి రాధాలు మంచి స్నేహితులు. వేర్వేరు పార్టీల్లో ఉన్నా కూడా వీరి మధ్య స్నేహంగానే కొనసాగారు. అయితే టీడీపీలో చేరిన తర్వాత ఆదివారం నాడే వంగవీటిరాధా, వల్లభనేని వంశీ, కొడాలి నానిలు కలిశారు.
గుడివాడలో నిర్వహించిన రంగా వర్ధంతి సభలో ఏపీ మంత్రి కొడాలి నాని వంగవీటి రాధాను ప్రశంసల్లో ముంచెత్తారు. వంగవీటి రాధా బంగారమని.. కాస్త రాగి కలిపితే ఎటు కావాలంటే అటు వంగొచ్చు అన్నారు. ఎమ్మెల్సీ ఇస్తామని అప్పటి టీడీపీ నేతలు ఆఫర్ ఇచ్చినా పదవులు ఆశించకుండా పార్టీలో చేరారని కొడాలి నాని ప్రశంసించారు. ఆదివారం నాడు ఉదయం విజయవాడలో వంగవీటి రంగా విగ్రహనికి టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో కలిసి రంగాకు నివాళులర్పించారు రాధా. ఈ సందర్భంగా వల్లభనేని వంశీ మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వంగవీటి రంగాలను ప్రజలు ఏనాడూ మర్చిపోరని ఆయన చెప్పారు.