వైఎస్ అవినాష్ రెడ్డి కాల్ రికార్డింగ్ లో సంచలనం ఏమీ లేదు: సజ్జల రామకృష్ణారెడ్డి

By narsimha lodeFirst Published Feb 3, 2023, 6:48 PM IST
Highlights

వైఎస్ వివేకానందరెడ్డి హత్య  కేసుకి సంబంధించి  వైఎస్ అవినాష్ రెడ్డి కాల్ రికార్డులో  సంచలనం ఏమీ లేదని  ఏపీ ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి  చెేప్పారు.  
 

అమరావతి: వైఎస్ వివేకానందరెడ్డి  హత్య కేసుకు సంబంధించి  కడప ఎంపీ  వైఎస్  అవినాష్ రెడ్డి  ఫోన్  కాల్  రికార్డులో సంచలనం ఏమీ లేదని  ఏపీ ప్రభుత్వ  సలహ దారు సజ్జల రామకృష్ణారెడ్డి  చెప్పారు.

శుక్రవారంనాడు  సాయంత్రం తాడేపల్లిలో  ఏపీ ప్రభుత్వ  సలహదారు  సజ్జల రామకృష్ణారెడ్డి  మీడియాతో మాట్లాడారు.  వైఎస్  వివేకానందరెడ్డి హత్య  కేసును జగన్  కు లింక్  చేసేందుకు  తప్పుడు ప్రచారం  చేస్తున్నారన్నారు..  వైఎస్ అవినాష్ రెడ్డికి  బంధువు ఫోన్  చేస్తే  కానీ వైఎస్ వివేకానందరెడ్డి  మృతి చెందిన విషయం తెలియదని  సజ్జల రామకృష్ణారెడ్డి  చెప్పారు. 

వైఎస్ వివేకానందరెడ్డి మృతి చెందిన విషయం   జగన్ కు సమాచారం ఇచ్చేందుకు  గాను   జగన్ వద్ద  పనిచేసే సిబ్బందికి ఫోన్  చేశారన్నారు.  జగన్  వద్ద ఫోన్ లేదన్నారు.  అందుకే  జగన్  వద్ద పనిచేసే  నవీన్,  కృష్ణమోహన్ రెడ్డిలకు  ఫోన్ లో  అవినాష్ రెడ్డి  సమాచారం  ఇచ్చాడని చెప్పారు.  నవీన్, కృష్ణమోహన్ రెడ్డిలు ఇంకా  జగన్ వద్దే  పనిచేస్తున్నారని  ఆయన గుర్తు  చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి  మృతి చెందిన  సమయంలో  చంద్రబాబునాయుడు  సీఎంగా   ఉన్నారని  ఆయన  చెప్పారు. ఈ ఫోన్ రికార్డులు  ఇవాళ కొత్తగా వచ్చినవి కావన్నారు. 

also read:చంద్రబాబు వ్యుహాంలో భాగంగానే ట్యాపింగ్.. రాజకీయంగా వాళ్లు దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు: సజ్జల కీలక కామెంట్స్

 ఈ ఘటన  జరిగిన   నాలుగేళ్ల తర్వాత  కొత్త అంశం తెరమీదికి వచ్చినట్టుగా  ప్రచారం చేయడం  పట్ల సజ్జల రామకృష్ణారెడ్డి ఆశ్చర్యం వ్యక్తం  చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య  కేసు విషయమై   ముందుగానే  ఎవరెవరికి  నోటీసులు ఇస్తున్నారనే  విషయమై  ఓ వర్గం మీడియాకు   సమాచారం ఎలా వస్తుందని  ఆయన ప్రశ్నించారు.  వైఎస్ అవినాష్ రెడ్డి  కాల్ రికార్డు అంశానికి సంబంధించి  చంద్రబాబు, బీజేపీ   స్లీపర్స్  సెల్స్ కుట్రలున్నాయని ఆయన  ఆరోపించారు.  వ్యవస్థ  ను  ప్రభావితం  చేయడం , మేనేజ్  చేయడంలో  చంద్రబాబు  సిద్దహస్తుడని  ఆయన  ఆరోపించారు.

click me!