టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్ కుప్పం కోట బద్దలైందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ ప్రభుత్వ పనితీరు ఆధారంగా ఓట్లు వేయాలని ప్రజలను కోరినట్టుగా ఆయన చెప్పారు.
అమరావతి: కుప్పం కోట తొలిసారి బద్దలైందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ ఎన్నికల్లో టీడీపీ ఇప్పటికే కాడి పడేసిందని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సోమవారం నాడు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. కుప్పం కోట కూడా చంద్రబాబు చేజారి పోతోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ ప్రభుత్వ పనితీరు ఆధారంగా ఓట్లు వేయాలని ప్రజలను కోరినట్టుగా ఆయన చెప్పారు. ఇప్పటికే వచ్చిన ఫలితాల్లో ప్రజలు తమకే పట్టం కట్టారన్నారు. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైసీపీ క్లీన్‌స్వీప్ చేసిందన్నారు. ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న అభిప్రాయం ఇప్పటికే తెలిసిపోయిందన్నారు. టీడీపీ ఇప్పటికే కాడి పడేసిందని ఆయన అభిప్రాయపడ్డారు.
వైసీపీ ఎప్పుడూ దిగజారుడు రాజకీయాలు చేయలేదని చెప్పారు. దొంగ ఓట్లు వేయడం ఎలా సాధ్యమౌతుందని ఆయన ప్రశ్నించారు. కుప్పంలో ycp దొంగ ఓట్లు వేయిస్తోందని చంద్రబాబు చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఈ విషయమై దొంగ ఓట్లు వేయడం ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు.రౌడీ షీటర్లను టీడీపీ ఏజంట్లుగా నియమించారని ఆయన ఆరోపించారు.కుప్పంలో 8 వేల దొంగ ఓట్లను టీడీపీ నేతలు నమోదు చేశారన్నారు.Chandrababu చెరలో దశాబ్దకాలంగా Kuppam మగ్గిపోయిందన్నారు.
also read:Chandrababu Naidu: పోలీసుల పని ప్రజలు చేయాలా?.. చరిత్రలో ఎన్నడూ ఇలా జరగలేదు.. చంద్రబాబు నాయుడు ఫైర్
తమ పార్టీ నేతలు చెబుతున్నారని Sajjala Rama krishna Reddy తెలిపారు. కుప్పం మున్సిపాలిటీలో ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకుtdp ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు. ఓటర్లకు టీడీపీ నేతలు డబ్బులు పంచారని మీడియా సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఓ వీడియో క్లిప్ ను ప్రదర్శించారు. సీఎం గా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని ఆయన చెప్పారు. మంచి చేసే నేతలను ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, జనసేన లోపాయికారీ ఒప్పందాలతో ఎన్నికలకు వెళ్లాయని ఆయన ఆరోపించారు.
ఇవాళ కుప్పం సహా రాష్ట్రంలోని మిగిలిన 11 మున్పిపాలిటీల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు వైసీపీ, టీడీపీలు సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. కుప్పం మున్సిపాలిటీ తొలిసారి ఏర్పడింది. ఈ మున్సిపాలిటీలో విజయం సాధించేందుకు రెండు పార్టీల నేతలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు రెండు రౌండ్లలో వెనుకబడ్డారు. కుప్పంలో చంద్రబాబు కోటను బద్దలు కొట్టే పనిని ఏపీ రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సీఎం జగన్ అప్పగించారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ నేతలు వ్యూహా రచన చేశారు.అయితే ఇటీవల కుప్పం టూర్ కు వచ్చిన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎలా విజయం సాధిస్తారో చూస్తానని చంద్రబాబు సవాల్ చేసిన విషయం తెలిసిందే.