గత కొంతకాలంలో ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న పీఆర్సీ వ్యవహారం ముదురుతోంది. కొంతకాలంగా పీఆర్సీ అమలు చేయాలంటూ ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వంపైన ఒత్తిడి తెస్తున్నారు.
గుంటూరు : ఏపీలో ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అన్నారు. ఆస్పత్రి వెళ్లేందుకు హెల్త్ కార్డులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరులో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం సమావేశమైంది.
ఇందులో AP NGO President బండి శ్రీనివాసరావు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘కోట్ల రూపాయల వైద్య బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. రెండేళ్లు గడిచినా సమస్యలు పరిష్కారం కాలేదు. గత నెలలోనే పీఆర్సీ అమలు చేయాలని సజ్జల చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి. సీఎం జగన్ జోక్యం చేసుకొని వెంటనే PRC అమలు చేయాలి. నెలాఖరులోగా పీఆర్సీ అమలు కాకపోతే ఈ నెల 27, 28 తేదీల్లో కార్యాచరణ ప్రకటిస్తాం. ఇక ఓపిక పట్టే పరిస్థితి లేదు.. తాడోపేడో తేల్చుకుంటాం’’ అని Bandi Srinivasa Rao అన్నారు.
కాగా గత కొంతకాలంలో ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న పీఆర్సీ వ్యవహారం ముదురుతోంది. కొంతకాలంగా పీఆర్సీ అమలు చేయాలంటూ ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వంపైన ఒత్తిడి తెస్తున్నారు. అయితు, అక్టోబర్ చివరికి పీఆర్సీ సమస్య పరిష్కారం అవుతుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గత నెలలో హామీ ఇచ్చారు.
అయినా... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, AP Government Employees మధ్య పీఆర్సీ(PRC) నివేదిక వ్యవహారం వివాదంగా మారుతూనే ఉంది. దీనిమీద కొద్ది రోజులుగా ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నతాధికారులకు మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి. పీఆర్సీ కోసం ఉద్యోగ సంఘాలు పట్టుబట్టగా.. ఇందుకు సంబంధించి గతంలో సీఎస్ ఆధ్వర్యంలో వేసిన కమిటీ అధ్యయనం చేయాల్సి ఉందని ఉన్నతాధికారులు చెప్పారు.
ఈ క్రమంలోనే 13 సంఘాల్లో 9 సంఘాల నాయకులు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నుంచి బయటికొచ్చేస్తాయి. పీఆర్సీ అంశంపై ఈ సంఘాలు పోరుబాటకు సిద్దమయ్యాయి. ఈ క్రమంలోనే ఉద్యోగ సంఘాలు కీలక ప్రకటన చేశాయి. పీఆర్సీపై ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు డెడ్‌లైన్ విధించాయి.
ఏపీలో పీఆర్సీకై పట్టు: జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ బైకాట్ చేసిన తొమ్మిది ఉద్యోగ సంఘాలు
ఈ నెలాఖారులోగా పీఆర్సీ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ నెలఖారు వరకు ప్రభుత్వానికి సమయమిస్తున్నట్టుగా ఏపీ జేఏసీ చైర్మన్ తెలిపారు. ఈ నెల 27లోగా అన్ని సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. అనంతరం భవిష్యత్ కార్యచరణను రూపొందిస్తామని వెల్లడించారు. తాము దాచుకున్న డబ్బులను కూడా తమకు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్సీ నివేదికపై సీఎస్ ఇచ్చిన హామీకే విలువ లేదని అన్నారు.
ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ జేఏసీ నిన్న చర్చలు జరిపినట్టుగా ఏపీ జేఏసీ నేతలు వెల్లడించారు. ఉద్యోగులు, కార్మికులు కలిపి సుమారు 200 సంఘాలు ఉన్నాయని చెప్పారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శకులు కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ నెలఖారు వరకు ప్రభుత్వానికి సమయం ఇస్తున్నామని వెల్లడించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు సమావేశమై కార్యచరణ రూపొందిస్తామని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మెమోరాండం ఇస్తామని తెలిపారు.