కార్తీక స్నానాల్లో అపశృతి... కృష్ణా నదిలో కొట్టుకుపోయిన ముగ్గురు యువకులు మృతి

By Arun Kumar PFirst Published Nov 15, 2021, 2:08 PM IST
Highlights

పవిత్రమైన కార్తీక సోమవారం రోజున నదీస్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు ప్రమాదవశాత్తు నీటమునిగి మృత్యువాతపడిన దుర్ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. 

విజయవాడ: పవిత్రమైన కార్తీక మాసంలో నదిస్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు ప్రమాదవశాత్తు నీటమునిగి గల్లంతయ్యారు. ఈ దుర్ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. ఇప్పటికే ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమవగా మరో యువకుడి కోసం గాలింపు కొనసాగుతోంది.  

వివరాల్లోకి వెళితే... పవిత్రమైన కార్తీక సోమవారం నాడు చాలామంది నదీస్నానాలు చేస్తుంటారు. ఇవాళ కార్తికమాసంలో వచ్చిన రెండో సోమవారం కావడంతో కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం తోట్లవల్లూరు గ్రామానికి చెందిన యువకులు నరేంద్ర, నాగరాజు, పవన్‌ నదీస్నానం చేయాలని భావించారు. ఉదయమే గ్రామానికి దగ్గర్లోని krishna river పాయవద్దకు వెళ్లిన ఈ ముగ్గురు స్నానానికే నీటిలోకి దిగారు. 

అయితే నీటిప్రవాహం ఎక్కువగా వుండటంతో స్నానానికి దిగిన ముగ్గురు మునిగిపోయారు. ఇలా యువకులు నీటమునిగిపోవడాన్ని గుర్తించిన కొందరు గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. వెంటనే గ్రామస్తులు ఘటనాస్థలికి చేరుకునే సమయానికే నదీ ప్రవాహంలో కొట్టుకుపోయి గల్లంతయ్యారు. 

read more  తూర్పుగోదావరి: ఎదురెదురుగా వచ్చిన బైకులు ఢీ.. నలుగురు యువకులు దుర్మరణం

గ్రామస్తులు నదీ పాయలోకి దిగి గాలింపు చేపట్టగా ఇద్దరి మృతదేహాలు లభించారు. మరో యువకుడి మృతదేహం కోసం గాలింపు కొనసాగుతోంది. 20ఏళ్లలోపు వయసున్న ముగ్గురు యువకులు ఇలా ప్రమాదానికి గురయి మృతిచెందడంతో తోట్లవల్లూరులో విషాదం నెలకొంది. యువకులు కుటుంబసభ్యులు ఘటనాస్థలంవద్ద కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నీటి ప్రవాహాల వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. 

read more  అల్పపీడనం ఎఫెక్ట్: సముద్రంలో బోల్తాపడ్డ బోటు.. ఈదుకుంటూ ఒడ్డుకు చేరిన మత్స్యకారులు

ఇదిలావుంటే ఇటీవల గుంటూరు జిల్లా అమరావతి మండలం దిడుగు గ్రామంలో కూడా ఇటీవల ఇలాంటి దుర్ఘటనే చోటుచేసుకుంది. సెలవురోజు కావడంతో గత ఆదివారం(నవంబర్ 7వ తేదీన) స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు నదీతీరానికి వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు మృత్యువాతపడ్డాడు. ఈత రాకపోయిన స్నేహితులతో కలిసి నదిలోకి దిగి లోతులోకి వెళ్లడంతో నీటమునిగి గల్లంతయ్యాడు.  

దిడుగు గ్రామానికి చెందిన షేక్ రిజ్వాన్(22 స్నేహితులతో కలిసి కృష్ణా నదిలో ఈతకు వెళ్లాడు. అయితే ఈత రాకపోయినా స్నేహితులతో కలిసి krishna river లోకి దిగి నీటితో సరదాగా ఆడుకుంటూ లోతులోకి వెళ్లాడు రిజ్వాన్. దీంతో నీటమునిగి నదీ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. 

రిజ్వాన్ ను కాపాడేందుకు స్నేహితులు ప్రయత్నించారు. అయినప్పటికి సాధ్యం కాకపోవడంతో గ్రామానికి వెళ్లిన పెద్దలకు విషయం తెలిపారు. దీంతో అందరూ ఘటనాస్థలికి చేరుకుని రిజ్వాన్ కోసం గాలించారు.  రాత్రి వరకు గాలించినా రిజ్వాన్ ఆచూకీ లభించలేదు. గ్రామస్తులు అందించిన సమాచారం మేరకు పోలీసులు తర్వాతి రోజు ఘటనాస్థలానికి చేరుకుని గజ ఈతగాళ్లతో రిజ్వాన్ మృతదేహంకోసం గాలించారు. వారు కూడా రాత్రివరకు గాలించినా ఫలితంలేకుండా పోయింది. అయితే రెండురోజుల తర్వాత ఘటన జరిగిన స్థలానికి అర కిలోమీటర్ దూరంలో రిజ్వాన్ మృతదేహం లభ్యమయ్యింది. 
 
 
 

click me!