విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేసీఆర్ దెబ్బకు కేంద్రం దిగి వచ్చిందని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్నినాని కౌంటరిచ్చారు.
తాడేపల్లి: ఆంధ్రాలోనే కేంద్రం దిగొచ్చిందా, తెలంగాణలో దిగి రాలేదా అని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని సెటైర్లు వేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేసీఆర్ దెబ్బకు కేంద్రం దిగొచ్చిందని తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలకు వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని కౌంటరిచ్చారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ముందుకు వెళ్లలేమని కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ ఇవాళ విశాఖలో ప్రకటించారు. కేసీఆర్ దెబ్బకు కేంద్రం దిగిచ్చిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేటీఆర్ వ్యాఖ్యలను పేర్ని నాని వద్ద మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై పేర్ని నాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ లు ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
undefined
తెలంగాణలో కేంద్రం దిగి రావడం లేదా అని ఆయన ప్రశ్నించారు.సింగరేణిని కూడా ప్రైవేటీకరించేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందని బీఆర్ఎస్ నేతలు చేసిన ప్రకటనలను పేర్ని నాని గుర్తు చేశారు.సింగరేణిలో కేంద్రం దిగిరాలేదా అని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేసీఆర్ దెబ్బకు కేంద్రం దిగి వచ్చిందని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై పేర్నినాని మండిపడ్డారు.ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగురుతున్నట్టుగా కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ను నిలబెట్టుకోవాలనేది తమ ప్రభుత్వ తాపత్రయంగా ఆయన పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు క్యాప్టివ్ మైన్ కేటాయించాలని కోరామన్నారు. స్టీల్ ప్లాంట్ ను అమ్మవద్దని తాము కోరుతున్నామన్నారు. కార్మికుల పక్షాన పోరాటం చేస్తున్నామని పేర్ని నాని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రజల ఆస్తిగా ఉండాలనేది తమ కోరికగా ఆయన పేర్కొన్నారు.