నర్సరావుపేటలో డిగ్రీ విద్యార్ధి అనూష హత్య: ప్రేమోన్మాది విష్ణువర్ధన్ రెడ్డికి జీవిత ఖైదు

Published : Apr 13, 2023, 02:14 PM ISTUpdated : Apr 13, 2023, 02:22 PM IST
నర్సరావుపేటలో డిగ్రీ విద్యార్ధి  అనూష హత్య: ప్రేమోన్మాది విష్ణువర్ధన్ రెడ్డికి జీవిత ఖైదు

సారాంశం

డిగ్రీ విద్యార్ధి  అనూషను  హత్య  చేసిన  కేసులో  నిందితుడు  విష్ణువర్ధన్ రెడ్డికి కోర్టు జీవిత ఖైదు  విధించింది. 

పల్నాడు:  డిగ్రీ విద్యార్ధి అనూష హత్య  కేసులో నిందితుడు  విష్ణువర్ధన్ రెడ్డికి  కోర్టు జివిత  ఖైదు  విధిస్తూ  తీర్పును వెల్లడించింది.2021  ఫిబ్రవరి  21న  నరసరావుపేటలో  డిగ్రీ విద్యార్ధి అనూషను  విష్ణువర్ధన్ రెడ్డి  గొంతు కోసి  చంపాడు . ఈ ఘటనలో  ఇవాళ  కోర్టు తుదితీర్పును వెల్లడించింది.

నర్సరావుపేటలోని కృష్టవేణి ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో  అనూష డిగ్రీ చదువుతుంది. అనూషను  హత్య  చేసి  విష్ణువర్ధన్ రెడ్డి కాలువలో  పడేశాడు.  గుంటూరు జిల్లాలోని  ముప్పాళ్ల మండలం  గోళ్లపాడు  గ్రామం అనూషది.విష్ణువర్ధన్ రెడ్డిది బొల్లాపల్లి  మండలం పమిడిపాడు గ్రామం, విస్ణువర్ధన్ రెడ్డి  అనూషను  ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నాడు. అనూష  మరొకరితో  చనువుగా ఉంటుందని  అనుమానంతో 2021  ఫిబ్రవరిలో  అనూషను  విష్ణువర్ధన్ రెడ్డి  గొంతు కోశాడు. అనంతరం  పోలీసులకు  ఆయన  లొంగిపోయాడు. 
 

PREV
click me!

Recommended Stories

Nimmala Ramanaidu Highlights Rayalaseema Irrigation Projects & Water Disputes | Asianet News Telugu
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం పొంచివుందా..? ఈ ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు