టీడీపీ చీఫ్ చంద్రబాబుపై ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు. బందరులో తనపై చేసిన విమర్శలకు చంద్రబాబుతో చర్చకు సిద్దమని ఆయన చెప్పారు.
తాడేపల్లి: నమ్మకానికి జగన్ బ్రాండ్ అంబాసిడడైతే వెన్నుపోటు , ద్రోహానికి చంద్రబాబు మారుపేరని పేర్ని నాని విమర్శించారు. గురువారంనాడు మాజీ మంత్రి పేర్నినాని మీడియాతో మాట్లాడారు. బందరు లో జరిగిన సభలో చంద్రబాబునాయుడు తనపై చేసిన విమర్శలకు పేర్నినాని కౌంటర్ ఇచ్చారు.
బందరు కు చంద్రబాబు ఏం చేశారని పేర్ని నాని ప్రశ్నించారు.
చంద్రబాబు నోరు తెరిస్తే అబద్దాలే మాట్లాడుతారన్నారు. 2014 లో ప్రజలకు ఇచ్చిన హామీని చంద్రబాబు అమలు చేయలేదన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు, సాఫ్ట్ వేర్ కంపెనీలు తెస్తానని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు.మే మాసంలో బందరు పోర్టు నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని పేర్ని నాని చెప్పారు. శరవేగంగా బందరు పోర్టు నిర్మాణ పనులను పూర్తి చేస్తామని పేర్ని నాని చెప్పారు.
undefined
పిల్లనిచ్చిన మామకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారన్నారు. బావమరుదులను తడిగుడ్డలతో గొంతు కోసిన వాడు సైకో కాదా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రప్రభుత్వం చేసిన అప్పులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గత నాలుగేళ్లలో మహిళలకు రాష్ట్రప్రభుత్వం రూ.1.42 లక్షల కోట్ల నగదును బదిలీ చేశామన్నారు.తనపై చంద్రబాబు చేసిన ఆరోపణలపై తాను చర్చకు సిద్దంగా ఉన్నానని ఆయన చెప్పార. దమ్ముంటే చంద్రబాబు చర్చకు రావాలని ఆయన కోరారు.
హైద్రాబాద్ ను మించిన సిటీగా బందరును మారుస్తానని చంద్రబాబు హామీ ఇచ్చాడని పేర్ని నాని గుర్తు చేశారు. కానీ ఈ హామీలను అమలు చేయలేదన్నారు. గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్ లను పేర్ని నాని మీడియా సమావేశంలో ప్రదర్శించారు. అదే విధంగా ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన హామీల వీడియోలను కూడా పేర్ని నాని మీడియాకు చూపారు. తమ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో 95 శాతం హామీలను అమలు చేసినట్టుగా పేర్ని నాని చెప్పారు.
చంద్రబాబు లాంటి పచ్చి రాజకీయ మోసగాడు ఎవరూ లేరన్నారు.నీరు- చెట్టు పథకంలో చంద్రబాబు రూ. 2 వేల కోట్లు కొట్టేశారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. జన్మభూమి కమిటీల పేరుతో పచ్చచొక్కాలకు దోచి పెట్టారని ఆయన చంద్రబాబుపై ఆరోపణలు చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన ఏ ఒక్క మంచి పనైనా చంద్రబాబు చెప్పగలరా అని పేర్ని నాని ప్రశ్నించారు. తన పాత పాలనను తెస్తానని ప్రజలకు చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని పేర్ని నాని ప్రశ్నించారు. జన్మభూమి కమిటీలను మళ్లీ ప్రవేశ పెట్టగలరా అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు.