గంజాయి దందాపై ఉక్కుపాదం: డీజీపీ గౌతం సవాంగ్

By narsimha lodeFirst Published Oct 26, 2021, 5:37 PM IST
Highlights


రాష్ట్రంలో గంజాయి దందాను అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకొంటున్నామని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ చెప్పారు.  గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది మూడు లక్షల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొన్నామన్నారు.

కాకినాడ: గంజాయి దందాపై ఉక్కుపాదం మోపుతామని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ చెప్పారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సంవత్సరం ఇప్పటికే అత్యధిక స్థాయిలో మూడు లక్షల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొన్నామన్నారు.మంగళవారం నాడు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పలు జిల్లాల ఎస్పీలతో ఏపీ డీజీపీ goutam sawang సమావేశమయ్యారు.ఈ సమావేశం ముగిసిన తర్వాత డీజీపీ మీడియాతో మాట్లాడారు. గంజాయి సరఫరా చేస్తున్న పదిహేను వందల వాహనాలను జప్తు చేసి, ఐదు వేల మంది నిందితులను అరెస్టు చేశామన్నారు.గతంలో ఎన్నడలేని విధంగా రాష్ట్రంలో  Ganja పై ఉక్కుపాదాన్ని మోపుతున్నామని ఆయన చెప్పారు.

also read:పట్టాభి దారుణమైన భాష వాడారు: ఏపీ డీజీపీ గౌతం సవాంగ్

అన్ని శాఖల సమన్వయంతో కలసి పనిచేస్తూ  గంజాయి సాగు, రవాణా ను నియంత్రించేందుకు, కట్టడి చేసేందుకు పూర్తి చర్యలు చేపడుతున్నామన్నారు.ఇతర రాష్ట్రాలకు చెందిన నేరస్తుల పై గట్టి నిఘా ఏర్పాటు చేయడంతోపాటు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వారందరిని చట్టం ముందుకు తీసుకు వస్తామని చెప్పారు.ముంద్ర పోర్టులో పట్టుబడిన హెరాయిన్ కి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో Drugs  పట్టుబడినట్లుగా జరుగుతున్న ప్రచారంలో ఆంధ్ర ప్రదేశ్ కి ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్రంలో విస్తృతంగా మత్తు పదార్ధాలు లభ్యమౌతున్నాయని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు సహా ఆ పార్టీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రం నుండి యధేచ్చగా గంజాయి సరఫరా అవుతుందని టీడీపీ ఆరోపణలు చేసింది.ఈ ఆరోపణలను వైసీపీ తీవ్రంగా ఖండించింది.
 

click me!