ముగిసిన బాబు ఢిల్లీ పర్యటన: దొరకని మోడీ, అమిత్ షా అపాయింట్‌మెంట్లు... రాష్ట్రపతి భేటీతోనే సంతృప్తి

By Siva KodatiFirst Published Oct 26, 2021, 4:59 PM IST
Highlights

టీడీపీ (tdp)అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు (chandrababu Naidu) ఢిల్లీ పర్యటన ముగిసింది. ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi), హోంమంత్రి అమిత్ షాను (amit shah) కలిసేందుకు అపాయింట్‌మెంట్లు కోరినా లభించే పరిస్థితులు లేకపోవడంతో ఆయన తిరిగి హైదరాబాద్‌కు వచ్చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది

టీడీపీ (tdp)అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు (chandrababu Naidu) ఢిల్లీ పర్యటన ముగిసింది. ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi), హోంమంత్రి అమిత్ షాను (amit shah) కలిసేందుకు అపాయింట్‌మెంట్లు కోరినా లభించే పరిస్థితులు లేకపోవడంతో ఆయన తిరిగి హైదరాబాద్‌కు వచ్చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అమిత్ షా జమ్మూకశ్మీర్ (jammu kashmir) వ్యవహారాల్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుత పరిస్ధితుల్లో ఆయన అపాయింట్‌మెంట్ ఎప్పుడు లభిస్తుందో స్పష్టత లేదు. అటు ప్రధానమంత్రి అపాయింట్‌మెంట్ కూడా లభించే అవకాశం కనిపించలేదు. అయితే కేంద్ర మంత్రుల్ని కలిసి ఏపీలో పరిస్థితులను వివరించాలనుకున్నారు. కానీ ఈ విషయంలో కూడా నిరాశే ఎదురవ్వడంతో ఒక్క రాష్ట్రపతిని మాత్రం కలిసి చంద్రబాబు ఫిర్యాదు చేయగలిగారు. అయితే హోంమంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్‌ లభించిన తర్వాత చంద్రబాబు మరోసారి ఢిల్లీ వెళ్తారని ప్రచారం జరుగుతోంది. 

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అసభ్యంగా దూషించారంటూ టీడీపీ నేత పట్టాభి ఇంటిపై, టీడీపీ కార్యాలయాలపై వైసీపీ దాడులు చేయడంతో  రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్ధితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీలో లా అండ్ ఆర్డర్ పూర్తి స్థాయిలో విఫలమయిందని చంద్రబాబు 36 గంటల దీక్ష చేసి.. రాష్ట్రపతికి ఫిర్యాదు చేసేందుకు టీడీపీ బృందంతో ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే.

కాగా, సోమవారం ఢిల్లీలో రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన చంద్రబాబు President Ramnath Kovindhను కలిశారు. అనంతరం Delhiలోనే ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రాథమిక హక్కుల్లేవని, మాట్లాడే హక్కుల్లేవని, ప్రశ్నించే హక్కులూ లేవని మండిపడ్డారు. స్వయంగా ముఖ్యమంత్రి, డీజీపీలు కలిసే ఉగ్రవాదానికి ప్రోత్సహిస్తున్నారని, తమ పార్టీ కార్యాలయాలపై అలాంటి Terrorismతోనే దాడులు జరిపించారని ఆరోపించారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతున్నదని, వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కోరినట్టు వెల్లడించారు.

ALso Read:సీఎం, డీజీపీలు కలిసే దాడులు చేయించారు.. రాష్ట్రపతికి చంద్రబాబు ఫిర్యాదు

సంక్షేమ చర్యల్లో, పురోగతిలో ఆంధ్రప్రదేశ్ దేశంలో నెంబర్ వన్ స్థానంగా వెలుగొందిందని, ఇప్పుడు YCP అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో ప్రజలు సిగ్గుపడే పరిస్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారని చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. ఇప్పుడు దేశంలో ఎక్కడ డ్రగ్స్ కేసు నమోదైనా, ఎవరూ డ్రగ్స్ గురించి మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే పరిస్థితులు దాపురించాయని అన్నారు. మద్యపానం నిషేధించాల్సి పోయి దేశంలో ఆ మాటకొస్తే ప్రపంచంలోనే ఎక్కడా కనిపించని బ్రాండ్ల పేరుతో మద్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమ్మిస్తున్నదని తెలిపారు. 

వైసీపీ అనుయాయులతో ఆ లిక్కర్ తయారు చేయించి ప్రభుత్వ సహకారంతో విక్రయాలు జరిపిస్తున్నదని మండిపడ్డారు. యువత ఒక్కసారి ఈ మాదకద్రవ్యాల బారిన పడితే దానికి బానిసలు అవుతారని, తద్వారా వారు ఉగ్రవాదులు, గ్యాంగ్‌స్టర్లు, రౌడీలు, ముఠాలుగా మారే ప్రమాదముందని అన్నారు. అందుకే డ్రగ్స్‌పై తాము గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీశామని వివరించారు. అందుకే TDPని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ చేసుకున్నదని చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలోని పార్టీ హెడ్‌క్వార్టర్ సహా విశాఖపట్నం, నెల్లూరు ఇంకా పలుచోట్ల ఆఫీసు కార్యాలయాలపై వరుసగా దాడులు జరిపించారని వివరించారు. తమ పార్టీ డీజీపీ కార్యాలయానికి ఒక కిలోమీటరు దూరంలో ఉన్నదని, పక్కనే సీఎం నివాసమున్నదని తెలిపారు. దాడి విషయం తెలియగానే తాను డీజీపీకి ఫోన్ చేశారని, తమ పార్టీ నేతలు స్థానిక పోలీసు అధికారులకు ఫోన్ చేసినా స్పందించలేదని అన్నారు.
 

click me!