పట్టాభి దారుణమైన భాష వాడారు: ఏపీ డీజీపీ గౌతం సవాంగ్

By narsimha lode  |  First Published Oct 20, 2021, 2:11 PM IST


 టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి దారుణమైన భాషను ఉపయోగించారని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ చెప్పారు.ఒక ముఖ్యమంత్రిపై అభ్యంతర వ్యాఖ్యలు చేయవద్దని ఆయన సూచించారు.


అమరావతి:నిన్న టీడీపీ అధికార ప్రతినిధి Pattabhi మాట్లాడింది దారుణమైన భాష అని ఏపీ డీజీపీ gautam sawangచెప్పారు.బుధవారం నాడు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్  విజయవాడలో మీడియాతో మాట్లాడారు. పట్టాభి వ్యాఖ్యల తర్వాతే ఆందోళనలు ప్రారంభమయ్యాయని ఆయన తేల్చి చెప్పారు.చట్టబద్దమైన పదవుల్లో ఉన్నవారిని తిట్టకూడదని డీజీపీ తెలిపారు. 

also read:రాష్ట్రంలో వైషమ్యాలకు టీడీపీ యత్నం: వైఎస్ జగన్

Latest Videos

పట్టాభి నోరు జారి అన్న మాటలు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక పార్టీ ఆఫీస్ నుండి పట్టాభి మాట్లాడారని ఆయన గుర్తు చేశారు.ఒక ముఖ్యమంత్రిపై అభ్యంతర వ్యాఖ్యలు చేయవద్దని ఆయన సూచించారు. నిన్న సాయంత్రం తనకు సాయంత్రం ఐదుగంటల మూడు నిమిషాలకు వాట్సాప్ కాల్ వచ్చిందని చెప్పారు. తనకు తెలియని నెంబర్ నుండి ఈ ఫోన్ కాల్ వచ్చిందని ఆయన గుర్తు చేసుకొన్నారు.  శబ్దాలతో మాట్లాడలేకపోయాయని ఆయన చెప్పారు.

ఎలాంటి క్లిష్ట సమయంలోనేైనా పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉంటారన్నారు.విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసుల త్యాగాన్ని మరవలేమన్నారు. రేపు పోలీస్ ప్లాగ్ డే నిర్వహిస్తున్నామన్నారు.కరోనాతో 205 మంది పోలీసులు మరణించారని ఆయన గుర్తు చేశారు.

click me!