ఓ పోలీస్ అధికారిపై దాడికి పాల్పడ్డాడన్న అభియోగాలతో మాజీ మంత్రి, టిడిపి అధికార ప్రతినిధి నారా లోకేష్ పై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసారు.
మంగళగిరి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ పై మంగళగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. స్థానిక సీఐ నాయక్ పై లోకేష్ దాడి చేసారని ఆరోపిస్తూ పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు హత్యాయత్నం కేసు నమోదు చేసారు. ఈ కేసులో లోకేష్ ను ఏ1గా పేర్కొన్న పోలీసులు ఎ2 అశోక్ బాబు, ఎ3 అలపాటి రాజా, ఎ4 తెనాలి శ్రవణ్ కుమార్. ఎ5 పోతినేని శ్రీనివాస రావు గా పేర్కొన్నారు. వీరితో పాటు మరికొందరు టీడీపీ నేతలపై కూడా కేసులు నమోదయ్యాయి.
మంగళవారం దాడి జరిగినTDP పార్టీ జాతీయ కార్యాలయానికి స్థానిక సీఐ నాయక్ వెళ్ళగా అక్కడే వున్న nara lokesh ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేసారని పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే లోకేష్ సహా అక్కడున్నవారు సీఐపై దాడికి తెగబడ్డారని... వారి నుండి తప్పించుకున్న సీఐ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సీఐపై దాడికి ప్రేరేపించింది లోకేష్ కాబట్టి ఆయనను ఎ1గా చేర్చినట్లు పోలీసులు వెల్లడించారు.
undefined
ఇదిలావుంటే మంగళవారం mangalagiri లోని tdp head office తో పాటు వివిధ చోట్ల టిడిపి ఆఫీసులపై దాడులు చేసిన 70 మంది వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. దాడుల సమయంలో తీసిన వీడియోలు, సిసి కెమెరాలో రికార్డయిన వీడియోలు, ప్రత్యక్ష సాక్షుల నుండి సేకరించిన వివరాల ఆధారంగా కొందరిని గుర్తించినట్లు... వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. టిడిపి కార్యాలయాలపై దాడులపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
read more ఏంటో చూపిస్తా... ఎలా ముగించాలో నాకు బాగా తెలుసు: వైసిపికి వంగవీటి రాధ స్ట్రాంగ్ వార్నింగ్ (వీడియో)
ఇక టిడిపి నాయకుల నివాసాలు, జాతీయ కార్యాలయంతో పాటు వివిధ ప్రాంతాల్లోని ఆఫీసులపై దాడులు జరగడంపై లోకేష్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనలపై తీవ్రంగా స్పందిస్తూ నీ కుక్కలతో ఎన్నాళ్లు దాడులు చేయిస్తావు... ఇంట్లోంచి బయటకు రా...తేల్చకుందాం! అంటూ సీఎం జగన్ కు సవాల్ విసిరారు.
గౌరవప్రదమైన రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో వున్నాడని ఇంతకాలం jagan ను గౌరవించేవాడినని... ఆయన వికృత చేష్టలు, క్రూర బుద్ది, సైకో వ్యవహారాలు, శాడిస్ట్ ఆలోచనలు చూసికూడా ఇక గౌరవించలేనని అన్నారు. రాష్ట్ర ప్రజలు డ్రగ్గిస్ట్ జగన్ అంటున్నారని... బినామీలతో డ్రగ్స్ దందా చేయిస్తున్నాడని ఆరోపణలున్నాయన్నారు. ఇదే విషయంపై నిలదీస్తే టిడిపి నేతలపై దాడులకు తెగబడతావా అటూ జగన్ పై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసారు.
read more టిడిపి కేంద్ర కార్యాలయంపై వైసిపి శ్రేణుల దాడి... పరిశీలించిన చంద్రబాబు, లోకేష్ (ఫోటోలు)
మీలాగే మేము కూడా ఆలోచిస్తే వైసిపి కార్యాలయాల విధ్వంసం నిమిషం పని అన్నారు. నీ ఫ్యాన్ రెక్కలు విరిచి, మడిచి నీ పెయిడ్ ఆర్టిస్టులను రాష్ట్రం దాటేంతవరకు తరిమి తరిమి కొడతాం జాగ్రత్త అంటూ లోకేష్ హెచ్చరించారు. అనవసరంగా మమ్మల్ని గెలికి నీ సమాధికి నువ్వే గొయ్యి తవ్వుకుంటున్నావు కోడి కత్తిగా! అంటూ జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు లోకేష్.