మేమేం గాజులు తొడుక్కోలేదు... తోలు ఒలిచేస్తాం జాగ్రత్త: టిడిపి నాయకులకు మంత్రి అనిల్ వార్నింగ్

By Arun Kumar PFirst Published Oct 20, 2021, 1:16 PM IST
Highlights

తమ నాయకుడు సీఎం జగన్ ను గానీ వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలను గాను అంటే ఊరుకునేది లేదని... తోలు ఒలిచేస్తామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హెచ్చరించారు. 

నెల్లూరు: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతిపక్ష టిడిపి కార్యాలయంపై, నాయకుల ఇళ్లపై దాడితో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. వైసిపి శ్రేణుల దాడిని ఖండిస్తూ టిడిపి ఇవాళ(బుధవారం) రాష్ట్ర బంద్ చేపట్టింది.  ఈ క్రమంలో నిన్న(మంగళవారం) టిడిపి, వైసిపిల మధ్య భౌతిక యుద్దం జరగ్గా నేడు మాటల యుద్దం కొనసాగుతోంది. రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ టిడిపి నాయకులకు గట్టిగా హెచ్చరించడంతో పాటు సవాల్ కూడా విసిరారు.  

రాష్ట్ర ముఖ్యమంత్రి ys jaganmohan reddy ని పట్టుకుని ఇష్టారాజ్యంగా మాట్లాడితే తోలు తీస్తామంటూ టిడిపి నేతలకు మంత్రి anil kumar yadav తనదైన శైలిలో హెచ్చరిక జారీ చేశారు. ysrcp అధ్యక్షులు జగన్ ను అనడం కాదు ఒక్క వైఎస్ఆర్ సిపి కార్యకర్తమీద చెయ్యి వేసి చూడండి... తోలు వలిచేస్తాం అని హెచ్చరించారు. 

''ఒక ముఖ్యమంత్రిపైన ఇష్టారాజ్యంగా మాట్లాడతారా? టీడీపీ నేతలు నోటికొచ్చినట్లు ముఖ్యమంత్రిని తిడుతూ తిరిగి మమ్మల్నే బూతులు మంత్రులు అని ప్రచారం చేస్తున్నారు. తమ సహనానికి కూడా ఒక స్థాయి ఉంటుంది'' అని మంత్రి అనిల్ పేర్కొన్నారు. 

వీడియో

''TDP జాతీయ అధికార ప్రతినిధి pattabhiram ముఖ్యమంత్రిని పట్టుకుని భోషడికే అని మాట్లాడితే మేము చేతులకు గాజులు తొడుక్కొని ఉండాలా. నెల్లూరు నగరంలో ఇంకా వారం రోజులు ఉంట... కాన్వాయ్, పోలీస్ బందోబస్తు లేకుండా తిరుగుతా. దమ్ముంటే నన్ను టచ్ చేయండి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వెళ్లాలంటే ముందు మమ్మల్ని దాటుకుని వెళ్లాలి. ఈ సంగతి గుర్తు పెట్టుకోవాలి'' అని మంత్రి అనిల్ అన్నారు. 

read more  జగన్ పై టీడీపీ బూతు వ్యాఖ్యలు.. చంద్రబాబు క్షమాపణ చెప్పాలి : సజ్జల రామకృష్ణా రెడ్డి

ఇక టీడీపీ నేతలు ఎంత రెచ్చగొట్టినా సంయమనం పాటించాలని మమ్మల్ని సీఎం జగన్ ఆదేశించారని ఏపీ ప్రభుత్వ చీప్ విప్  శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. అయితే టీడీపీ నేతలు ప్రియతమ నాయకుడు Ys jagan ను తిడుతుంటే వైసీపీ కార్యకర్తలు భరించలేకపోయారని... అందుకే టిడిపిపై తిరగబడ్డారని ఆయన వివరించారు. జగన్ ను ప్రేమించే వ్యక్తులు టీడీపీ నేతల మాటల్ని ఎన్నాళ్లు భరిస్తారని ఆయన ప్రశ్నించారు.

ప్రభుత్వం చేస్తున్న పథకాలపై తప్పులుంటే ఎత్తి చూపాలి కానీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తూ నీచమైన భాషను ఉపయోగిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఏనాడైనా ప్రజలకు ఇచ్చిన మాటను నిలుపుకొన్నారా? అని ప్రశ్నించారు. సీఎంగా జగన్ మంచిపేరు రావడం చూసి భరించలేక తమ పార్టీ నాయకులతో చంద్రబాబే అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారని ఆరోపించారు. ఇందుకు గాను చంద్రబాబే సీఎం జగన్ కు క్షమాపణ చెప్పాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేసారు. 

click me!